Ram Gopal Varma's controversial tweet on SS Rajamouli - Sakshi
Sakshi News home page

రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

Jan 24 2023 10:26 AM | Updated on Jan 24 2023 11:08 AM

Ram Gopal Varma Controversy Tweet On Ram Gopal Varma - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై రాజమౌళి ప్రసంగించారు. జేమ్స్‌ కామెరూన్‌ లాంటి దిగ్గజ దర్శకుడే  ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసలు కురిపించారంటే..రాజమౌళి పనితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ భారతీయ దర్శకుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం, ఆయన తెరకెక్కించిన చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు రావడం..నిజంగా భారతీయ సీనీ చరిత్రలో రికార్డు అని చెప్పొచ్చు. అయితే రాజమౌళిపై ప్రపంచ స్థాయి సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తుంటే.. భారతీయ దర్శకులు మాత్రం ఈర్ష్యతో రగిలిపోతున్నారట. అంతేకాదు అతన్ని హత్య చేసేందుకు కుట్ర కూడా చేస్తున్నారట. ఈ విషయాన్ని వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ.. తాజా అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటాడు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌కు వరుసగా పలు అంతర్జాతీయ అవార్డులు రావడం.. జేమ్స్‌ కామెరూన్‌ లాంటి దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించడంపై ఆర్జీవీ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి ముచ్చట్లు పెట్టిన వీడియోని షేర్‌ చేస్తూ.. ‘మొఘల్ ఈ ఆజాం తీసిన కా ఆసిఫ్ నుంచి.. షోలే తీసిన రమేష్‌ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావ్.. ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావ్.. నీ కాలి బొటనవేలుని చీకాలని ఉంది’అని ఆర్జీవి ట్వీట్‌ చేశాడు. 

ఇక మరో ట్వీట్‌లో ‘రాజమౌళి సర్ దయచేసి మీరు మీ భద్రతను పెంచుకోండి.. ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా నీ మీద ద్వేషంతో రగిలిపోతోన్నారు.. వారంతా మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. అందులో నేను కూడా ఉన్నాను.. కానీ నాకు నాలుగు రౌండ్లు పడే సరికి ఇలా చెప్పేశాను’ అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే రాజమౌళిని ప్రశంసించడానికే ఆర్జీవీ ఈ తరహా ట్వీట్స్‌ చేశారు. అందరి మాదిరిగా స్పందిస్తే ఆయన ఆర్జీవీ ఎందుకు అవుతాడు? ఏం మాట్లాడినా కాస్త వెరైటీగా ఉండాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement