SS Rajamouli Shocking Comments On RGV: దర్శకు ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ పాన్ ఇండియా చిత్రాన్ని డివీవీ దానయ్య నిర్మించాడు. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి మరోసారి మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న జక్కన్న వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: సందీప్ వంగ మూవీలో రష్మిక ఐటెం సాంగ్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
అబద్దాలు చెప్పడంలో ఆర్జీవీని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉంటే భారీ సినిమాలను తెరకెక్కించడంలో జక్కన్న తీరు తెలిసిందే. ఆయన సినిమాలో ఈ అసాధారణమైన భారీ యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక అవి పర్ఫెక్ట్‌గా ఉండేలా జక్కన్న జాగ్రత్త పడుతుంటాడు. అందుకే ఆయన సినిమాలకు సంవత్సరాల పాటు సమయంలో తీసుకుంటాడు. ఇలా బాహుబలికి ఏకంగా 5 సంవత్సరాల సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. దానికి ముందు చరణ్ ‘మగధీర’ సినిమాకు 2 సంవత్సరాలకు పైగా సమయం తీసుకున్నాడు.
ఇదే విషయంపై మగధీర మూవీ సమయంలో రాజమౌళి స్పందించాడు. ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు, ఎక్కువ కాలం షూటింగ్స్ చేయను అని స్టేజ్‌పై మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో జక్కన్నను దీనిపై ప్రశ్నించగా ‘మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు, ఎక్కువ రోజులు షూటింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అనుకున్నట్టే ‘ఈగ’, ‘మర్యాద రామన్న’ సినిమాలు చేశాను. కానీ ‘బాహుబలి’ సినిమాతో అలా ఉండటం నా వల్ల కాలేదు. భారీ బడ్జెట్ సినిమాలు తీయను అని చెప్పి మాట తప్పింది నిజమే.
చదవండి: నటి ప్రగతి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మూవీ తెలుసా?
కానీ అందుకు రామ్ గోపాల్ వర్మను స్ఫూర్తిగా తీసుకొని అబద్దం చెప్పాను’ అంటూ చమత్కరించాడు. ఇక ఆర్జీవీ తీరు అందరికి తెలిసిందే. తాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏంటీ ఇలా అంటే నేను అంతే అంటాడు. నేను చెప్పింది చేయనని, ఇచ్చిన మాట మీద నిలబడనంటూ తనదైన శైలి చెబుతుంటాడు. తాజాగా జక్కన్న ఈ విషయంలో ఆర్జీవిని స్ఫూర్తిగా తీసుకున్నానంటూ ఇంటర్య్వూలో మధ్యలో వర్మ పేరును తీసుకురావడం ఆసక్తిని సంతరించుకుంది. ఇక వీడియోను ఆర్జీవీ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అంతేకాదు దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment