
ప్రస్తుతం టాలీవుడ్‌లో షూటింగ్ సంక్షోభం నెలకొంది. ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్స్‌పై పలువురు సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ క్రమంలో షూటింగ్స్ బంద్‌పై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ సందర్భంగా తాజాగా ఓ తెలుగు చానల్‌తో ముచ్చటించిన వర్మ టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి దర్శక ధీనుడు రాజమౌళి కారణమంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
చదవండి: ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో ‘మా’ కీలక భేటీ.. ‘అవసరమైతే స్ట్రయిక్ తప్పదు’
అయితే ఈ బంద్‌కు కారణం ఓటీటీలు, నటీనటులు, హీరో పారితోషికమే ప్రధాన కారణమని నిర్మాతలు చెబుతున్న విషయం విధితేమే. ఓటీటీ వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదన్న నిర్మాతల వాదనను ఈ మేరకు వర్మ కొట్టిపారేశాడు. టాలీవుడ్‌కు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి, యూట్యూబ్ చానళ్లని.. ఓటీటీలు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం ప్రేక్షకులు షాట్ వీడియోలకు అలవాటు పడ్డారు. ఎక్కువగా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నారు. థియేటర్లో రెండు గంటల పాటు ఓపిగ్గా సినిమా చూడాలంటే రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్ లేదా కేజీయఫ్ లాంటి సినిమాలు మాత్రమే తీయాలి’ అని వ్యాఖ్యానించాడు.
చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు
Comments
Please login to add a commentAdd a comment