సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్‌రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు.
బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్‌స్ట్రక్షన్, ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు.
బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం.
అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్‌పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్‌రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment