సాక్షి, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీని విమర్శించేస్థాయి రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. గతంలో టీడీపీ-బీజేపీ సమావేళాలు చాలా జరిగాయని రఘనందన్‌రావు శుక్రవారమిక్కడ గుర్తుచేశారు. అప్పుడు ఎవరి డబ్బులతో రేవంత్ అక్కడికి వచ్చారని ఆయన ప్రశ్నించారు. కాగా తెలంగాణలో టీడీపీ లేదని బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, మురళీధర్‌రావు వంటివారు బహిరంగంగానే చెప్పారని.. మరి ఇప్పుడు రాష్ట్రంలో అదే బీజేపీ నేతలతో టీటీడీపీ నేతల సమన్వయం ఎలా సాధ్యమైందని రేవంత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, టీడీపీలను కలిపిన ఆ అదృశ్యశక్తి ఎవరని ఆయన ప్రశ్నించారు.