సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎంపీ రంజీత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇద్దరు నేతలు ఫోన్ సంభాషణలో దుర్భాషలాడుకున్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండాకు ఫోన్ చేసి ఎంపీ రంజిత్ ప్రశ్నించారు. దీంతో నీకు దమ్ము ధైర్యం ఉంటే నా వాళ్లను తీసుకువెళ్లు అని కొండా స్పందించారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో రచ్చకు దారితీసింది.
దీంతో బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై మాజీ ఎంపీ కోండా విశ్వేశ్వరరెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో రంజిత్‌రెడ్డిపై కొండా కంప్లైంట్ చేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌లో తనను దూషించాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
ఫిర్యాదు ఎవరు ఫోన్ చేశారో పేరు కూడా చెప్పానని అన్నారు.పెద్దల సలహా మేరకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫోన్‌తో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడని అన్నారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏం లేదని, అతనున బీఆర్ఎస్, తాను బీజేపీ అని అన్నారు. ఫోన్ నెంబర్, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment