![Chevella Mp Ranjith Reddy Criticizes Tpcc Chief Revanth Reddy In Parigi - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/28/ranjth-reddy.jpg.webp?itok=CMsTS7ve)
పరిగి: ‘దమ్ముంటే రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చెయ్. నేనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తా. నువ్వో నేనో తేల్చుకుందాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సవాలు విసిరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మన ఊరు– మన పోరు’లో రేవంత్‌రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి పరిగిలో మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అవును నా వ్యాపారం పౌల్ట్రీ. గుడ్లు అమ్ముకుంటే తప్పేముంది. చేవెళ్ల ఏ ప్రభుత్వం హయాం లో అన్ని విధాలుగా అభ్యున్నతి సాధించిందో చర్చ చేద్దాం’ అన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గొప్పగా రూపొందించారని తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ హోదాలో ఉన్న రేవంత్, ఎంపీ, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాం గ్రెస్ హయాంలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దేవుని మాన్యాల కబ్జా లను నిరూపించాలన్నారు. ఈ భేటీలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment