వాగులో పడి కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్ర శివారులోని వాగులో పడి కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా నివాసముంటున్న రంజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వాగులోని నీటి ప్రవాహాన్ని చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులకు సోమవారం ఉదయం యువకుల మృతదేహాలు లభించాయి.