displaced
-
మయన్మార్‌లో పడవ ప్రమాదం
-
ఇద్దరు యువకులు మృతి
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్ర శివారులోని వాగులో పడి కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా నివాసముంటున్న రంజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వాగులోని నీటి ప్రవాహాన్ని చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులకు సోమవారం ఉదయం యువకుల మృతదేహాలు లభించాయి. -
‘రెవెన్యూ’లో బదిలీలు
14 మంది తహసీల్దార్లకు స్థానచలనం వెయిటింగ్లో ఉన్న నలుగురికి పోస్టింగ్ నిజామాబాద్ డీఆర్వోగా ఎస్.పద్మాకర్ త్వరలో మరో ఆర్డీవో బదిలీకి అవకాశం ఇదివరకే బోధన్ ఆర్డీవో శ్యాంప్రసాద్ బదిలీ ఆర్మూర్‌కు త్వరలో కొత్త ఆర్డీవో నియామకం వేగంగా సాగుతున్న ‘పునర్విభజన’ ప్రక్రియ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా మొదటగా రెవెన్యూశాఖను పటిష్టం చేసేందుకు ప్రక్షాళన మొదలైంది. దీర్ఘకాలికంగా ఒకేచోట కొనసాగుతున్న రెవెన్యూ అధికారులతోపాటు పరిపాలన సౌలభ్యం, సమర్దత ఉన్న అధికారులను కొత్త జిల్లాల ఏర్పాటులో భాగస్వాములు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా 14 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లుగా వెయిటింగ్లో ఉన్న మరో నలుగురికి కూడా పోస్టింగ్ ఇచ్చారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా హైదరాబాద్‌లో భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శిగా ఉన్న ఎస్.పద్మాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పరిపాలనా సౌలభ్యం, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అవశ్యంగా భావించి బోధన్ ఆర్డీవో జీవీ శ్యాంప్రసాద్ లాల్‌ను ఇదీవరకే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్డీవోగా ప్రభుత్వం బదిలీ చేసినా ఆయన ఇంకా రిలీవ్ కాలేదు. కొత్త ఆర్డీవోను కూడా నియమించకపోగా.. ఒకేచోట దీర్థకాలికంగా పనిచేస్తున్న మరో ఆర్డీవోకు కూడా స్థానచలనం కలగనుందన్న ప్రచారం ఉంది. అలాగే కొత్తగా ఏర్పడిన ఆర్మూరు రెవెన్యూ డివిజన్‌కు పూర్తికాలపు ఆర్డీవోను కూడా రెండు రోజుల్లో నియమించనున్నట్లు తెలిసింది. బదిలీలపై ‘పునర్విభజన’ ముద్ర జిల్లాల పునర్విభజనలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఏర్పడనుండగా.. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్లను బదిలీ చేశారన్న చర్చ జరుగుతోంది. పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయగలరన్న భరోసా ఉన్న పలువురు తహసీల్దార్లను కీలకమైన ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది వేర్వేరు చోట్లకు బదిలీ చేయాలని కోరినా.. పరి పాలన సౌలభ్యం, కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో పె ట్టుకుని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా బదిలీలు చేసినట్లు తెలిసింది. ఈ క్ర మంలోనే డిచ్పల్లి తహసీల్దార్ డి.రవీందర్ ఆర్మూరు కావాలని కోరినా ఆ యనను పనితీరును పరిగణలోకి తీసుకుని కొత్తగా ఏర్పడే కామారెడ్డి జి ల్లా కేంద్రంలో తహసీల్దార్‌గా నియమించినట్లు సమాచారం. అలాగే భిక్కనూర్ తహసీల్దార్ అంజయ్యను కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఏవోగా నియమించారు. బోధన్ తహసీల్దార్ సుదర్శన్‌ను నిజామాబాద్‌కు బదిలీ చేసి, నిజామాబాద్ తహసీల్దార్ రాజేందర్‌ను ఆర్మూరుకు బదిలీ చేశారు. ఆర్మూరు తహసీల్దార్‌ను కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆర్మూరు, నిజామాబాద్ తహసీల్దార్ల బదిలీ విషయంలో మాత్రం ఓ డివి జన్ స్థాయి అధికారి సిఫారసు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా మొత్తం 14 మంది తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం కలగగా.. వె యిటింగ్‌లో ఉన్న తహసీల్దార్లు ఎస్.పెద్దులు నిజామాబాద్ ఏవోగా పో స్టింగ్ దక్కగా, ఎస్.రఘునాథ్, కె.సుధాకర్ రెడ్డి, ఎం.డి.అబ్దుల్ ఘనీఖాన్లకు తాడ్వాయి, భిక్కనూరు, నిజాంసాగర్ తహసీల్దార్లుగా పోస్టింగ్ ఇచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా పద్మాకర్ కొంత కాలంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టు ఎట్టకేలకు భర్తీ అయ్యింది. ఇన్చార్జి పాలనతో కొనసాగుతున్న ఈ పోస్టులో రెగ్యులర్ అధికారిగా ఎస్.పద్మాకర్‌ను నియమిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి బి.ఆర్.మీనా జీవో ఆర్.టి.నెం.300ను విడుదల చేశారు. పద్మాకర్ హైదరాబాద్‌లో భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. బదిలీపై జిల్లాకు డిఆర్వోగా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. -
జిల్లాలో 12 మంది ఎస్ఐల బదిలీ
సంగారెడ్డి జోన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న ఎస్ఐలు బదిలీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 12 మందికి స్థాన చలనం కల్పిస్తూ హైదరాబాద్ రేంజ్ ఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వ్యవసాయ బావిలో పడి బాలుడి గల్లంతు
స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్ జిల్లా): ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతైన ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాసాని పెద్దాపురం, రూప దంపతుల ఒక్కగానొక్క కుమారుడు విజయ్ (14) తోటి మిత్రులతో కలిసి గ్రామ సమీపంలోని వాగులో ఉన్న వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అందరూ బావిలో దూకి ఈతకొడుతుండగా... కొద్ది సేపటి తర్వాత విజయ్ దూకాడు. ఎంతసేపటికీ విజయ్ నీటిపైకి రాకపోవడంతో పిల్లలు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి బావిలో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బావి బాగా లోతుగా ఉండటంతో బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో రాత్రి 7గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు చీకటి పడటంతో వెలికితీత పనులు విరమించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యు గుమ్మి
గాదెగుమ్మిలో అసిస్టెంట్ సేల్స్‌మేనేజర్ గల్లంతు మొత్తం 39 మందిని మింగేసిన జలపాతం {పమాదాల నివారణకు ముందస్తు చర్యలు శూన్యం కొయ్యూరు: గాదెగుమ్మి మరొకరిని బలితీసుకుంది. సరదాగా ఇక్కడ గడిపేందుకు వచ్చేవారు ప్రమాదానికి గురై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ జలపాతం వద్ద గడిపేందుకు వచ్చిన యువకుడు గురువారం సాయంత్రం ఇందులో గల్లంతయ్యాడు. అతడు మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ప్రవాహం తక్కువగా ఉన్నా..లోతు ఎక్కువ కావడంతో అందులో పడి గల్లంతయ్యాడు. విశాఖపట్నానికి చెందిన నవీన్(28) నర్సీపట్నం జయభేరి కార్ల షోరూంలో అసిస్టెంట్ సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం నవీన్ ,అతని స్నేహితులు అనంత్, ఎమ్డీ జఫరుల్లా విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి ముగ్గురూ గాదేగుమ్మి జలపాతం వద్దకు వచ్చారు. ఇక్కడ గంటల తరబడి సరదాగా గడిపారు. ఫొటోలు తీసుకుంటుండగా కాలు జారి నవీన్ జలపాతంలో పడిపోయాడు. ఇలా జలపాతంలో పడి మరణించిన వారి సంఖ్య 39కి చేరింది. కార్తీక మాసంలో ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతం పిక్నిక్కు ప్రసిద్ధి. ఎక్కెడెక్కడి నుంచో ఇక్కడి అందాలను తిలకించేందుకు వచ్చి ప్రమాదానికి గురవుతున్నారు. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాము తెలిపారు. గాలించినప్పటికీ ఫలితం లేకపోవడం, చీకడిపడిపోవడంతో శుక్రవారం కొనసాగిస్తామన్నారు. ఇందులో మునిగినవారు అడుగుభాగంలో ఉన్న రాయికిందికి వెళ్లిపోతున్నారు. వినయ్‌చంద్ ఐటీడీఏ పీవోగా ఉన్నప్పుడు రూ.లక్షతో ఈ రాయిని పగులగొట్టే పనులు చేపట్టారు. పూర్తి చేయకపోవడంతో జలపాతంలో పడిన ఎవరైనా వెంటనే బయటకు రాలేక చనిపోతున్నారు. -
ఈతకు వెళ్లిన విద్యార్థి గల్లంతు
అనంతపురం: ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్(20) కాలువలో పడి గల్లంతైన సంఘటన అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలంలో జరిగింది. రాయంపల్లిలో జరుగుతున్న రథోత్సవానికి కుటుంబ సభ్యులతో వచ్చిన సురేష్ మంగళవారం ఉదయం స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అతనికి సరిగా ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అతని కోసం పోలీసుల పర్యవేక్షణలో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
బకింగ్‌హాం కెనాల్లో రైల్వే ఉద్యోగి గల్లంతు
దుగ్గిరాల/తెనాలి రూరల్: తెనాలి పట్టణానికి చెందిన ఓ రైల్వే ఉద్యోగి దుగ్గిరాల లాకు వద్ద కృష్ణా పశ్చమ ప్రధాన కాలువలో సోమవారం గల్లంతయ్యాడు. ఆదివారం నిర్వహించుకున్న మీలాదున్ నబీకి సంబంధించిన పూలను నీటిలో నిమజ్జనం చేసే ప్రయత్నంలో కాలుజారి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి గంగానమ్మపేటలోని సాయి అపార్ట్మెంటులో నివాసం ఉంటున్న పట్టణానికి చెందిన షేక్ ఫరీద్‌బాషా (34) రైల్వే డ్రైవర్‌గా విజయవాడలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై విజయవాడవెళ్తూ, మార్గంమధ్యలో దుగ్గిరాల పాతలాకు వద్ద ఆగాడు. లాకు తూముల వద్ద కాలువ కట్టపై బైక్, అతని బ్యాగు ఉంచి కాలువ ఒడ్డుకు వెళ్లాడు. పూలు కాలువలో వదులుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలోపడి గల్లంతయ్యాడు. కాలువ నీటిలో మునిగిపోతూ రక్షించండంటూ ఆర్తనాదాలు చేశాడని, సమీపంలో పురుషులు ఎవ్వరూ లేకపోవడంతో రక్షించలేకపోయారని స్థానిక మహిళలు చెప్పారు. విషయం తెలిసిన ఏఎస్ఐ సుభాని, సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మోటారుసైకిల్, బ్యాగును స్వాధీనపరచుకుని, కాలువ వెంట కొంతదూరం గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. బ్యాగ్‌లో రెండు సెల్ఫోన్లు, యూనిఫాం దుస్తులు, డ్యూటీకి సంబంధించిన మూడు పుస్తకాలు, రెండు పేపర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా తెనాలిలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పలువురు దుగ్గిరాల చేరుకున్నారు. కాలువ వెంట గాలింపు చర్యలు ప్రారంభించారు. తోటి ఉద్యోగి కాలువలో గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న పలువురు రైల్వే ఉద్యోగులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కేసునమోదు చేసి విచారిస్తున్నట్లు దుగ్గిరాల ఏఎస్ఐ సుభాని తెలిపారు. గల్లంతైన ఫరీద్బాషాకు భార్య హర్షదున్నీసా, మూడేళ్ల కుమారుడు తాజ్‌బాషా ఉండగా, తల్లిదండ్రులు షేక్ ఖాదర్‌వలి, నజీరున్నీసాలతో కలసి గంగానమ్మపేటలోని సాయి అపార్టుమెంటులో నివాసం ఉంటున్నట్లు బంధువులు చెప్పారు. -
గల్లంతైంది ఎందరు...ఏమయ్యారు!?
నౌకలో ఉన్నది 28 మంది కంటే ఎక్కువేనా? జాడలేనివారి సంఖ్యను తప్పుగా చూపుతున్నారా? ‘టీఆర్వీ-72’ మునకఘటనపై గోప్యత పాటిస్తున్న నౌకాదళ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన కొందరు! సాక్షి, విశాఖపట్నం: ‘నవంబర్ 6, గురువారం..సాయంత్రం 6.30 నిమిషాలు.. తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్(టీఆర్వీ)-72 నౌక ఇంజిన్లోకి నీరు రావడం మొదలైంది. క్రమంగా నౌక అంతటా వ్యాపించి ముంచేసింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా నలుగురు సిబ్బంది గల్లంతయ్యారు.’-నాలుగు రోజుల క్రితం నౌకాదళ అధికారులు చెప్పిన మాటలు ఇవి. ఆ తర్వాత వారి నుంచి ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. గల్లంతైన వారు ఏమయ్యారో చెప్పడం లేదు. అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏ చిన్న సమాచారం బయటకు పొక్కినా సహించమంటూ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. కాగా, గల్లంతయిన వారు అసలు ఎందరు అనే అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఘటనపై ‘సాక్షి’కి లభించిన విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... ఆ రాత్రి ఏం జరిగింది? యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడోలను తిరిగి సేకరించడానికి టోర్పెడో రికవరీ వెహికల్(టీఆర్వీ)-72ను ఉపయోగిస్తుంటారు. ఆ రోజు కూడా అదే చేశారు. తొలుత ఒక టోర్బెడోనూ విజయవంతంగా ప్రయోగించి వెనక్కు తీసుకువచ్చారు. రెండో టోర్పెడోను ప్రయోగించిన తర్వాత దానికి సేకరించేందుకు టీఆర్వీ-72 ప్రయత్నించింది. ఆ సమయంలో నేవీ సిబ్బంది డాక్పైనే ఉన్నారు.అకస్మాత్తుగా డాక్పైకి సముద్రం నీరు వచ్చేసింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నౌక మునగడం ప్రారంభించింది. కేవలం 30 సెకన్లలో నౌక అంతటా నీరు చేరింది. ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టులైన సిబ్బంది ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న చిన్న బోట్లలో ఎక్కి కొందరు తప్పించుకున్నారు. మరి కొందరు లైఫ్ జాకెట్ల వేసుకుని ధైర్యం చేసి సముద్రంలో దూకేశారు. అలా దూకిన వారు చిమ్మ చీకట్లో, నడిసముద్రంలో దాదాపు గంటన్నరపాటు నరకం చూశారు. బతుకుతామో లేదో తెలియక, మృత్యువు కోరల్లో ఆయువు కోసం పోరాడారు. మునిగిపోయిన నౌక ఉన్న ప్రాంతం నుంచి అతి కష్టం మీద ఈదుకుంటూ వెళుతుండగా ఓ విద్యుత్ లైట్ కనిపించింది. దగ్గరకు వెళ్లగా అది ఓ నౌకగా తెలిసింది. వెంటనే రక్షించమని కేకలు వేస్తూ, ఆ నౌకలోని సిబ్బంది సాయంతో బతికి బయటపడ్డారు. అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకుని నేవీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. వారు వెంటనే నౌకలను,హెలికాప్టర్లను సంఘటన స్థలానికి పంపించారు. నౌకలో ఎంతమంది ఉన్నారు? సాధారణంగా ప్రతి నౌకలోనూ కెప్టెన్, ఎగ్జిక్యూటివ్ నావిగేషన్, ఇంజన్, నావిగేటింగ్, వెపన్స్, ఎలక్ట్రికల్, కుకింగ్, క్లీనింగ్ సిబ్బంది ఉంటారు. టీఆర్వీ-72లోనూ వీరందరి అవసరం తప్పనిసరి. అయితే నేవీ అధికారులు 28 మంది సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య 30-35 మధ్య ఉంటుందని తెలిసింది. వారిలో నిజంగా గల్లంతైన వారెందరనేది తేలాల్సి ఉంది. ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరు? టీఆర్వీ-72లో నేవీ సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. నిజానికి రక్షణ శాఖ నౌకలోకి ఇతరులను అనుమతించడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఆరుగురు బయటి వ్యక్తులు ఆ రోజు నౌకలో ప్రయాణించినట్లు సమాచారం. వారంతా ఓ ప్రభుత్వ సంస్థకు చెందిన సిబ్బందిగా తెలిసింది. సబ్మెరైన్లు, నౌకలను విచ్ఛిన్నం చేసే టోర్పెడో(ఆయుధం)ను ఎన్ఎస్టీఎల్ తయారు చేస్తోంది. ఆ సంస్థ తయారు చేసిన టార్పెడోకు ఉండే మోటార్ల పనితీరును వీరు పరీక్షిస్తుంటారు. అయితే అది నౌక సముద్రంలోకి వెళ్లక ముందే జరుగుతుంది. కానీ నేవీ అధికారులకు, వారి సంస్థకు పరస్పర అవగాహన ఉండటంతో నిబంధనలను తోసిపుచ్చి వారిని నౌకలోకి అనుమతించినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ వారందరూ క్షేమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే ఉద్యోగాలు పోతాయని భయపడి ఎవరికి వారు గోప్యత పాటిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులకు మాత్రం సమగ్ర సమాచారాన్ని అందజేయకతప్పలేదు. ఈ నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని విశాఖ నేవీ అధికారులు కలవరపడుతున్నారు. -
దైవదర్శనానికి వెళ్లి నదిలో గల్లంతు
పర్ణశాల వద్ద గోదావరిలో మునిగిన యువకుడు స్వగ్రామం పాత రావిచర్ల తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు పాతరావిచర్ల(నూజివీడు రూరల్) : మండలంలోని పాత రావిచర్లకు చెందిన యువకుడు స్నేహితులతో కలిసి భద్రాచలంలో స్వామివారి దర్శనానికి వెళ్లాడు. మార్గమధ్యంలో వారు పర్ణశాలలో ఆగారు. ఆ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. స్నేహితులు ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. కుమారుడి జాడ కోసం దంపతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యువకుడి తండ్రి, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం... పాత రావిచర్లకు చెందిన కొణతం వీర్రాజు, లక్ష్మీకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దవాడైన చెన్నారావు(22)కు, కుమార్తె భవానికి(20)కి వివాహమైంది. చిన్నవాడైన కొణతం లోక్నాధ్(19) ఏడో తరగతితో చదువు మానేశాడు. కొత్తరావిచర్ల గ్రామ శివారులోని సాయి ఆగ్రో కంపెనీలో నెలరోజుల క్రి తం ఉద్యోగంలో చేరాడు. కంపెనీ యజమాని వారానికొకసారి జీ తాలు ఇస్తుంటాడు. లోక్నాధ్ శని వారం సాయంత్రం జీతం తీసుకున్నాడు. గ్రామానికి చెందిన స్నేహితులు మందనాటి నాగరాజు, మందపాటి ఏడుకొండలు, పాలకుర్తి వెంకటేశ్వరరావు, కొలుసు రాంబాబు, మందపాటి కుమారస్వామి, ఆరేపల్లి రమేష్‌లతో కలిసి మరీదు రాముకు చెందిన ఆటోలో శనివారం రాత్రి భద్రాచలం వెళ్లాడు. గ్రామంలో అనుకున్నట్లు కాకుండా వారందరూ ముందుగా భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు ఆదివారం ఉదయం ఆరు గంటలలోపు చేరుకున్నారు. అక్కడ గోదావరిలో స్నానానికి ఉపక్రమించారు. కొందరు మహిళలు స్నానం చేస్తుండటంతో కొంత ముందుకు వెళ్లారు. లోక్నాధ్ అక్క డ కాలుజారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడిని రక్షించేందుకు మిత్రులు యత్నించారు. నది ఉధ్రుతంగా ప్రవహిస్తుండటంతో వారి ప్రయత్నా లు ఫలించలేదు. అతడి మిత్రులు గ్రామంలోని తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, ఈ విషయాన్ని చెప్పారు. శనివారం రాత్రి 11 గంటలకు ఇంటినుంచి బయలుదేరిన కుమారుడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలైనా ఫోన్ చేయకపోవడంతో స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటాడని తల్లిదండ్రులు భావించారు. కుమారుడితో కలిసి వెళ్లిన స్నేహితులు ఎక్కడున్నారో ఫోన్ చేశారా ?అని వారి తండ్రులను వీర్రాజు ఆరా తీ శారు. మీ కుమారుడు గోదావరిలో ప్రమాదవశా త్తు పడి గల్లంతయ్యాడని వారు ఆయనకు చె ప్పా రు. ఆయన ఇంటికి వచ్చి భార్యకు ఈ విష యం చెప్పాడు. కుమారుడి జాడ తెలియక పోవడంతో దంపతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
కదలిక ఖాయం
ల్లో భారీ మార్పులకు అవకాశం జిల్లా నేతలను సంప్రదిస్తున్న అధికార గణం అనంతపురం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జిల్లాలో పలువురు అధికారులకు స్థానచలనం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని తిష్టవేసిన వారిని పంపించడానికి తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇతర విషయాల్లో ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న ‘తమ్ముళ్లు’.. అధికారుల బదిలీల విషయంలో మాత్రం ఏకతాటిపై నిలబడినట్లు తెలుస్తోంది. తమకు నచ్చని వారిని జిల్లా నుంచి పంపించడానికి రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులతో తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, గ్రామీణ నీటి సరఫరా, ఎక్సైజ్, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల్లో అధికారులను బదిలీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులకు సైతం స్థాన చలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఖాయమని తొలి నుంచి ఆశలు పెట్టుకున్న ఓ నాయకుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఎలాగైనా రీకౌంటింగ్ పెట్టి తాను గెలిచేలా చూడాలంటూ ఆ నేత జిల్లా అధికారులకు భారీ ఆఫర్లు ఇచ్చారు. ఈ విషయంలో సహకరించాలని ఓ పోలీసు ఉన్నతాధికారిని సైతం కోరారు. అయితే.. ఆయన ససేమిరా అనడాన్ని జీర్ణించుకోలేని ఆ నేత ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సదరు పోలీసు అధికారిని బదిలీ చేయించాలని పంతం పట్టినట్లు తెలిసింది. కదిరిలో టీడీపీ నాయకుడికి రైట్‌హ్యాండ్‌లా పనిచేసే ఓ గ్యాస్ ఏజెన్సీ డీలర్ దాచి ఉంచిన అక్రమ గ్యాస్ సిలిండర్లను ఎన్నికలకు ముందు రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆ విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలని స్థానిక తహశీల్దార్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులపై ఆ నేత ఒత్తిడి తెచ్చారు. వారు ఖాతరు చేయలేదు. దీంతో ప్రస్తుతం వారిని బదిలీ చేయించే పనిలో ఆ నేత నిమగ్నమైనట్లు సమాచారం. మంత్రి పరిటాల సునీత ద్వారా బదిలీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకుల పైరవీలకు అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం ఆ ఉన్నతాధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేసి.. తమకు అనుకూలమైన అధికారిని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, టీడీపీ నేతలకు ఆ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడని ఆ ఉన్నతాధికారే స్వయంగా బదిలీపై వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి రఘువీరారెడ్డికి తలలో నాలుకలా మెలిగిన సమాచార, పౌర సంబంధాల శాఖలోని ఓ అధికారి బదిలీ తప్పదన్న ప్రచారం సాగుతోంది. రఘువీరా అండదండలతో ఆ అధికారి అప్పట్లో ఎవర్నీ లెక్కచేయకుండా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికీ ఆ అధికారి నిత్యం రఘువీరాకు టచ్‌లో ఉంటూ.. ఆయన సూచనల మేరకే పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలాగైనా బదిలీ చేయించాలని టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నట్లు తెలిసింది. ఆయన మాత్రం తన బదిలీని నిలుపుదల చేయించుకోవడానికి రఘువీరా దౌత్యంతో మంత్రి పరిటాల సునీతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం. -
రామకృష్ణ కాలనీలో 500 ఓట్లు గల్లంతు
-
తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతే
తూప్రాన్, న్యూస్‌లైన్:ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అడ్డుకున్నది తానేనని ఒప్పుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, టీడీపీకి తెలంగాణలో స్థానం లేదని గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఇమాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బాలపోచయ్యతో పాటు గ్రామానికి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం చేకూరిందన్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. అనంతరం రావె ల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పోతరాజుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. అనంతరం రావెల్లి, పోతరాజుపల్లి గ్రామాలకు చెందిన సుమారు 150 మంది యువకులు గ్రామ సర్పంచ్ మల్లేశ్ యాదవ్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నేతలు విజయభాస్కర్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్, లక్ష్మీనర్సింలుగౌడ్, కమ్మరి సత్యనారాయణ, పెంటాగౌడ్, రవీందర్‌గుప్త, వెంకట్‌రెడ్డి, నాగరాజుగౌడ్, వెంకటస్వామి, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.