ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్(20) కాలువలో పడి గల్లంతైన సంఘటన అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలంలో జరిగింది.
అనంతపురం: ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్(20) కాలువలో పడి గల్లంతైన సంఘటన అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలంలో జరిగింది. రాయంపల్లిలో జరుగుతున్న రథోత్సవానికి కుటుంబ సభ్యులతో వచ్చిన సురేష్ మంగళవారం ఉదయం స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు.
అతనికి సరిగా ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అతని కోసం పోలీసుల పర్యవేక్షణలో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.