విపక్షాల భేటీలో రాహుల్‌తో కేకే, ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో రెండోరోజూ ఆందోళనను కొనసాగిం చారు. మంగళవారం సభ మొదలవగానే ధాన్యం సేకరణపై కేంద్రం విధానాన్ని తప్పుబడుతూ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, రాములు, దయాకర్, నేతకాని వెంకటేశ్ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు.
స్పీకర్ ఓం బిర్లా కోరినా వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గం.కు ఆయన వాయిదా వేశారు. మరో రెండుసార్లు సభ వాయిదా తర్వాత మొదౖ లెనా ఎంపీల ఆందోళన చేయడంతో మాట్లాడేందుకు నామాకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. నామా మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కొనుగోళ్లపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరో మాట చెబుతోంది.
దీనిపై ప్రకటన చేయాలి’ అని కోరారు. కేంద్రం నుంచి ఏ ప్రకటన రాకపోవడంతో ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. తర్వాత ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేప ట్టారు. తెలంగాణభవన్‌లో ఎంపీలు మాట్లాడారు.
చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ కలిసి
రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల అంశం పై మాట్లాడేందుకు కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే తన చాంబర్‌లో నిర్వహించిన విపక్ష పార్టీ నేతల భేటీకి 15 పార్టీల నేతలు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ కూడా హాజరైంది.
భేటీలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పక్కనే కూర్చొని ఎంపీల సస్పెన్షన్‌పై తన అభిప్రాయం చెప్పారు. సస్పెన్షన్ ఎత్తేసేలా ఒత్తిడి చేయాలన్న కాంగ్రెస్ వినతికి మద్దతిచ్చారు. తర్వాత విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపగా కేకే హాజరయ్యారు. రాజ్యసభ మొదలయ్యాక విపక్ష సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని, కేంద్రంలోని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ తూర్పారపడుతున్న సమయంలో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి టీఆర్‌ఎస్ ఆందోళనలో పాల్గొనడం ఢిల్లీలో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment