తెలంగాణ మెట్రో కారిడార్‌కు రూ.8,453 కోట్లు | Central Govt Said RS 8453 Crores For Telangana Metro Corridor | Sakshi
Sakshi News home page

తెలంగాణ మెట్రో కారిడార్‌కు రూ.8,453 కోట్లు

Published Fri, Dec 16 2022 8:30 AM | Last Updated on Fri, Dec 16 2022 8:44 AM

Central Govt Said RS 8453 Crores For Telangana Metro Corridor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2017 మెట్రో రైల్‌ పాలసీలో భాగంగా 50:50 ఈక్విటీ షేర్‌ పద్ధతిలో రూ.8,453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ వెల్లడించారు. మెట్రోకారిడార్‌ సాయం ఏమైందని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రాయదుర్గం స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు.  

ఎన్‌హెచ్‌–65లో 6 లేన్లు అవసరం లేదు 
ప్రస్తుతం నందిగామ సెక్షన్‌లో నాలుగు లేన్లు సరిపోతాయి లోక్‌సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు ఇచ్చారు. ఎన్‌హెచ్‌-65లో 6 లేన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: హైదరాబాద్‌–విజయవాడ ఎన్‌హెచ్‌-65పై నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement