
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని సోమవారం ప్రకటించిన టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో ఆయన నివాసంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేకే విడుదల చేసిన లేఖతో ఆయన్ను కలిశాను. ఆర్టీసీ సమస్యను అర్థం చేసుకొని మంచి మనసుతో ఆయన స్పందించారు. సమ్మె వల్ల అందరికీ నష్టమే. టీఆర్‌ఎస్‌కు కూడా రాజకీయంగా మైనస్సే. కానీ సీఎం మాత్రం మొండిగా ఉంటున్నారు. ఆయనకు పోలీస్‌శాఖ ఒక్కటే ఉంటే సరిపోతుందనుకుంటున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తేనే చర్చలు జరుపుతామని కేకే చెప్పార’ని కొండా వెల్లడించారు.