K. Keshava Rao
-
తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు కేసీఆర్
-
కేకేతో భేటీ అయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని సోమవారం ప్రకటించిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో ఆయన నివాసంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేకే విడుదల చేసిన లేఖతో ఆయన్ను కలిశాను. ఆర్టీసీ సమస్యను అర్థం చేసుకొని మంచి మనసుతో ఆయన స్పందించారు. సమ్మె వల్ల అందరికీ నష్టమే. టీఆర్ఎస్కు కూడా రాజకీయంగా మైనస్సే. కానీ సీఎం మాత్రం మొండిగా ఉంటున్నారు. ఆయనకు పోలీస్‌శాఖ ఒక్కటే ఉంటే సరిపోతుందనుకుంటున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తేనే చర్చలు జరుపుతామని కేకే చెప్పార’ని కొండా వెల్లడించారు. -
టీఆర్ఎస్ దళపతి కేసీఆర్
⇔ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎనిమిదోసారి ఎన్నిక ⇔ ప్లీనరీలో జయజయధ్వానాలు.. అభినందనలు తెలిపిన నేతలు ⇔ అందరికీ ధన్యవాదాలు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా ఎనిమిదోసారి గులాబీ దళపతిగా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్లో ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి పార్టీ అధ్యక్ష ఎన్నికపై ప్రకటన చేశారు. అందరూ కేసీఆర్ నాయకత్వమే కావాలని కోరుకున్నారని.. అందుకే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం కొంపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రగతి ప్రాంగణంలో టీఆర్ఎస్ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పార్టీలో సీనియర్ నేత, సెక్రెటరీ జనరల్ ఎంపీ కె.కేశవరావు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణుల జయజయధ్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది. గులాబీ దళపతిగా తిరిగి పగ్గాలు అందుకున్న తమ అధినేత కేసీఆర్‌కు ముందుగా మంత్రులు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ఎమ్మెల్యేలు వేదికపైకి వెళ్లి అభినందనలు తెలిపారు. నేతల ఆత్మీయ పలకరింపులు, సెల్ఫీలతో సభాప్రాంగణమంతా కోలాహ లంగా మారింది. ప్లీనరీ వేదికపై మేయర్ బొంతు రామ్మోహన్ స్వాగతం పలకగా.. శాసన మండలి పార్టీ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఎంపీ కె.కేశవరావు తొలి పలుకులు అందించే ప్రసంగం చేశారు. అనుమానాల్ని పటాపంచలు చేశాం: కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ అధినేత కేసీఆర్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘‘2001లో తెలంగాణలో దిక్కుతో చని స్థితిలో సమైక్య పాలకుల అహంకార పూరిత అవమానాలతో కుంగి కృశించి పోతున్న తరుణంలో గులాబీ జెండా ఎగిరిం ది. ఈ పార్టీ ఉంటుందా అని అందరికీ అను మానం ఉండేది. కానీ అన్ని అనుమానాల్ని పటాపంచలు చేసి తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసింది’’అని అన్నారు. ప్రతి గింజపై కేసీఆర్ పేరు: పల్లా ప్రతి బియ్యపు గింజపై తినేవాడి పేరుంటుం దనే నానుడిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తిరగరాశారని పార్టీ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఇకపై తినే గింజపై రైతు పేరు.. రైతుకు అండగా నిలిచిన కేసీఆర్ పేరు ఉంటుందని అన్నారు. పార్టీ సభ్యత్వానికి అపూర్వ స్పందన లభించిం దని, ఈసారి 75 లక్షలకు చేరిన తీరు దేశంలోనే అద్వితీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పండు గలు, పబ్బాలు, బతుకమ్మలు, బోనాలన్నిం టినీ ఉద్యమ రూపంగా మలిచిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలకు ఆత్మీయ బంధువుగా నిలిచాడని అన్నారు. కారణజన్ముడు..: కేకే ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని, తెలంగాణలో నూతన శకానికి నాంది పలికిన నాయకుడని సీనియర్ నేత కేకే అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకా లను రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్రానికే కొత్త నిర్వచనం ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. ఆర్థిక లక్ష్య సాధనతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం తోనే పాలనకు సార్థకత వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ
12 ప్రాధాన్య అంశాల గుర్తింపు: కేకే సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశ పెట్టడానికి 12 ప్రాధాన్య అంశాలను గుర్తించామని టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చెప్పారు. ఆయన నివాసంలో పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ శనివారం భేటీ అయింది. కమిటీ సభ్యులు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి హాజరయ్యారు. కమిటీ గుర్తించిన ప్రాధాన్య అంశాలను చర్చించి రాజకీయ తీర్మానాలు కూడా ఆమోదిస్తామని, సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. బీసీ, ఎంబీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలపై తీర్మానాలు ఉంటాయన్నారు. నీటిపారుదల రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర తీర్మానాలు చేస్తామన్నారు. పదహారో ప్లీనరీని ఈ నెల 21న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్‌లో, పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఓయూ ఉత్సవాలపై ప్రభుత్వ పెత్తనం లేదు
రాజ్యసభ సభ్యుడు కేకే వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓయూపూర్వ విద్యార్థులం దరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ కోటిన్నర మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని, 20 వేల మంది పీహెచ్‌డీలు తీసుకున్నారని కేకే తెలిపారు. శనివారం ఆయన తన నివాసంలోవిలేకరులతో మాట్లాడుతూ, యూనివర్సిటీ ఉత్సవాలపై ప్రభుత్వ పెత్తనం ఏమీలేదని, యూనివర్సిటీతో సంబంధమున్న అన్ని వర్గాలనూ ఉత్సవాల్లో భాగస్వాములను చేస్తామని తెలిపారు. ఉత్సవాలకోసం రూ.200కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందని, సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు, పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు కూడా స్వచ్ఛందంగా ఈ ఉత్సవాల్లోపాల్గొంటున్నారని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలకు గుర్తింపు ఎన్నికలు జరగాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. -
మాదిగలది న్యాయమైన డిమాండ్: కేశవరావు
సాక్షి, న్యూఢిల్లీ: వర్గీకరణ కోసం మాదిగలు 23 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, వారిది న్యాయమైన డిమాండ్ అని టీఆర్ఎస్ పార్ల మెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. 2 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు మంగళవారం ఆయన హాజరై సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ మాదిగ జేఏసీ చైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాలో రవి మాట్లాడుతూ.. బీజేపీపై ఒత్తిడి తెచ్చి వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎంపీల బృందంలో జి.నగేశ్, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు. -
‘రాజ్యసభ’కు మద్దతివ్వండి: కేకే
అక్బరుద్దీన్, పొన్నాలతో భేటీ సీపీఐ, బీజేపీతోనూ మంతనాలు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు సోమవారం వివిధ పార్టీల నేతల మద్దతు కోరారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సీపీఐ, బీజేపీ సభ్యులను కూడా కలసి మద్దతు కోరారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న కేకే.. నామినేషన్ పత్రాలపై టీఆర్ఎస్ శాసనసభ్యులతో సంతకాలు చేయించుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలకు కేకే మధ్యాహ్న విందు ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో కేకే గెలుపుకోసం టీఆర్ఎస్ శాసనసభ్యులతో పాటు ఇతర పార్టీల నుంచి మద్దతు ఇస్తున్నవారితో సమన్వయ బాధ్యతను ఈటెల రాజేందర్, కేటీఆర్‌లకు పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అప్పగించారు. ఎంఐఎం పార్టీ సభ్యులతో కేటీఆర్, ఎంపీ జి.వివేక్ మాట్లాడుతున్నారు. సీపీఐ శాసనసభ్యులతో ఈటెల, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ సమన్వయం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఆరుగురు సభ్యులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ ఇద్దరిని మాత్రమే పకటించనుంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా కేకే నామినేషన్ మాత్రమే ఉంటే ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. అలా కాకుండా కాంగ్రెస్ మద్దతుతో మరో అభ్యర్థి రంగంలో ఉండి.. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయే పరిస్థితులు ఉంటే నామినేషన్ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. -
టీ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి పెంచాల్సిందే: కె.చంద్రశేఖర్‌రావు
తెరాస ముఖ్యులతో కేసీఆర్ సమావేశం బంద్, జాతీయ స్థాయి పరిణామాలపై చర్చ కాంగ్రెస్ నేతల బలహీనతలవల్లే రాయల తెలంగాణ: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడిని మరింత పెంచాల్సిందేనని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు నివాసంలో టీఆర్ఎస్ ముఖ్యులతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. గురువారంనాటి బంద్, వివిధ పార్టీల వైఖరి, తెలంగాణపై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల తీరు వంటి పరిణామాలపై ఈ సందర్భంగా కేసీఆర్ విశ్లేషించారు. తెలంగాణ జిల్లాల్లో బంద్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. బంద్ పిలుపుతో పాటు టీఆర్ఎస్ జరుపుతున్న నిరసనల ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనా ఒత్తిడి పెరిగినట్టుగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణను వ్యతిరేకించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మరింత ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 6న జరిగే టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో, ప్రజాప్రతినిధుల సమావేశం అంశాలపైనా స్థూలంగా కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు రిటైర్డు ఐఏఎస్ అధికారులు కేవీ రమణాచారి, ఏకే గోయల్, రామలక్ష్మణ్, పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహ్మారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, రిటైర్డు చీఫ్ ఇంజనీరు ఆర్.విద్యాసాగర్‌రావు, యువజన విద్యార్థి విభాగాల అధ్యక్షులు బొంతు రామ్మోహన్, బాల్క సుమన్, గాయకులు దేశ్‌పతి శ్రీనివాస్ ఉన్నారు. సీఎం కుర్చీ కోసం ఎత్తులవల్లే రాయల తెలంగాణ: కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాట తప్ప రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారక రామారావు విమర్శించారు. రాయల తెలంగాణ ఏర్పాటు వద్దంటూ హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, డి. శ్రీనివాస్ వంటివారు కుర్చీకోసం ఎత్తులు వేయడం తప్ప రాష్ట్ర ఏర్పాటును పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ నేతల బలహీనత వల్లే రాయల తెలంగాణ తెరపైకి వచ్చిందని విమర్శించారు. గురువారం బంద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ దిరిగేలా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే, తెలంగాణ ప్రాంత న్యాయవాదులంతా విధులను బహిష్కరించి పెద్దఎత్తున ర్యాలీలను నిర్వహించాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
కుట్రలతో కడుపులు మండుతున్నాయి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలతో ఈ ప్రాంత ప్రజల కడుపులు మండిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేంద్రమంత్రుల స్థాయిలో ఉన్నవారు కూడా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు ఆగ్రహావేశాలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ విషయం మాట్లాడితే నాలుకలు చీరేస్తామంటూ టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చెప్పారని, ప్రజలకు కూడా అదే స్థాయిలో ఆగ్రహం వస్తోందని కేకే హెచ్చరించారు. తెలంగాణకు 60 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని, అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్న ప్రజల్లో ఓపిక, సహనం పెరిగి సీమాంధ్రులపై ఇప్పటిదాకా ఎలాంటి దాడులు జరుగలేదని తెలిపారు.ఈ ప్రాంత ప్రజల మంచితనాన్ని, సహనాన్ని చేతకానితనం అనుకోవటం మంచిది కాదని కేకే హెచ్చరించారు. రాష్ట్రం సిద్ధించేదాకా సహనం, ఓపికతో ప్రజాస్వామ్యయుతమైన పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ భాగస్వామిగా ఉంటుందని కేకే వివరించారు. కేసీఆర్ సహా పార్టీ నేతలందరికీ పదవులు, అధికారం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి కాంగ్రెస్, టీడీపీ సహా అన్ని పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని కేకే చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాటం న్యాయబద్దమైన, ధర్మబద్దమైన డిమాండుకోసమేనని అన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. రెచ్చగొట్టడం సీపీఎంకు మంచిదికాదు : వినోద్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ వ్యతిరేక ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు కోరటాన్ని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. సీమాంధ్ర నాయకులు పదవులకు రాజీనామాలు చేయాలంటూ రాఘవులు మాట్లాడటం శోచనీయమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నందున రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ఇప్పటిదాకా చెప్పిన సీపీఎం వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో చెప్పాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. -
హైదరాబద్‌లో ఉన్న సీమాంద్రులకు భయం లేదు : కేకే