మాదిగలది న్యాయమైన డిమాండ్: కేశవరావు | sc demand is justice only, says Keshava Rao | Sakshi
Sakshi News home page

మాదిగలది న్యాయమైన డిమాండ్: కేశవరావు

Published Wed, Aug 10 2016 1:57 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

మాదిగలది న్యాయమైన డిమాండ్: కేశవరావు - Sakshi

మాదిగలది న్యాయమైన డిమాండ్: కేశవరావు

సాక్షి, న్యూఢిల్లీ:  వర్గీకరణ కోసం మాదిగలు 23 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, వారిది న్యాయమైన డిమాండ్ అని టీఆర్‌ఎస్ పార్ల మెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. 2 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు మంగళవారం ఆయన హాజరై సంఘీభావం ప్రకటించారు.

తెలంగాణ మాదిగ జేఏసీ చైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాలో రవి మాట్లాడుతూ.. బీజేపీపై ఒత్తిడి తెచ్చి వర్గీకరణకు కృషి చేస్తామన్నారు.  ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎంపీల బృందంలో జి.నగేశ్, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement