
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం లేఖ రాశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేస్తానని ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగానే ఉన్నట్టుగా ప్రకటించిందని గుర్తుచేశారు.