ఎస్సీ వర్గీకరణకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు టీఆర్‌ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ సాధనకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు టీఆర్‌ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఎమ్మార్పీఎస్, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో జరిగిన ధర్నా కార్యక్రమంలోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమాల్లో జేఏసీ ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటక రాజు మాదిగ, టీఎండీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల మల్లికార్జున్ మాదిగ తదితరులు మాట్లాడారు.