‘ప్రజాపాలనలో టీఆర్‌ఎస్‌ విఫలం’ | 'TRS fail in public administration' | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలనలో టీఆర్‌ఎస్‌ విఫలం’

Published Tue, Aug 8 2017 12:51 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

‘ప్రజాపాలనలో టీఆర్‌ఎస్‌ విఫలం’ - Sakshi

‘ప్రజాపాలనలో టీఆర్‌ఎస్‌ విఫలం’

జనగామ అర్బన్‌:  తెలంగాణ ప్రభుత్వం ప్ర జాపాలనలో పూర్తిగా విఫలమైందని జాతీ య ఎస్సీ రిజర్వేషన్‌ పరిరిక్షణ సమితి (ఎన్‌ఎస్‌సీఆర్‌పీఎస్‌) జాతీ య అధ్యక్షుడు కర్నె శ్రీశైలం అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉ మ్మడి వరంగల్‌ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు  దుర్వినియోగం అవుతున్నాయని, సర్టిఫికెట్ల జారీలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయ 0ని ఆరోపించారు.

క్రైస్తవమతంలోకి మారిన దళితులకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈనెల 30న జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్‌ సీబీ వెంకటేష్, జిల్లా, పట్టణ అధ్యక్షులు స్వామి, సాయికృష్ణ,  రాజు, మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement