జయలతాదేవి(ఫైల్)
సాక్షి, వికారాబాద్(రంగారెడ్డి) : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తల్లి, స్వర్గీయ జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి జయలతాదేవి (91) శనివారం ఉదయం కన్నుమూశారు. విశ్వేశ్వర్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళవారం. మాధవరెడ్డి దంపతులకు కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాతృమూర్తి మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. విశ్వేశ్వర్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించి సంతాపం తెలిపారు. సినీ హీరో చిరంజీవి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. కొండా నివాసానికి చేరుకుని జయలతాదేవి పార్థీవదేహానికి నివాళర్పించారు. రేపు(సోమవారం) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment