
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటలతో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే చర్చించుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతులను కేసీఆర్ పాటించడం లేదని మండిపడ్డారు.
అదే విధంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈటలను ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుకున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయొచ్చు కదా అని నిలదీశారు.
చదవండి: కమలం గూటి వైపు సంకేతాలు
Comments
Please login to add a commentAdd a comment