సాక్షి, హైదరాబాద్: తొలివిడత పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తెలంగాణలో నామినేషన్లు సోమవారంతో ముగిశాయి. నామినేషన్ల సందర్భంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివరాలు అందిన అభ్యర్థుల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ప్రకారం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తుల్లో, అప్పుల్లోనూ మొదటి స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.895 కోట్లకు పైగా ఆస్తులు, రూ.35 కోట్లకు పైగా అప్పులున్నాయి. ఇందులో తమతో పాటు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులను వెల్లడించారు. ఆస్తుల్లో భాగంగా చరాస్తుల్లో బ్యాంకు బ్యాలెన్సులు, షేర్లు, బాండ్లు, పెట్టుబడులు, ఎల్‌ఐసీ పాలసీలు, హ్యాండ్‌లోన్లు, బంగారు, వెండి, ఇతర ఆభరణాలు, కార్లు, హెచ్‌యూఎఫ్‌ల కింద వ్యాపారాలు, ట్రస్టుల వివరాలను వెల్లడించారు. స్థిరాస్తుల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, బిల్డింగులు తదితర వివరాలు వెల్లడించారు.
అభ్యర్థులు తమ అఫిడవిట్‌లలో వెల్లడించిన వివరాల ప్రకారం అందరి కన్నా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తులు ఎక్కువని తేలింది. సికింద్రాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్‌యాదవ్ అప్పులివ్వడంలోనూ, తీసుకోవడంలోనూ మొదటిస్థానంలో ఉన్నారు. భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు ఎక్కువ సంఖ్యలో (విస్తీర్ణం కాదు) వ్యవసాయ భూములు, స్థలాలున్నాయని ఆయన అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. అభ్యర్థులందరి అఫిడవిట్‌లను పరిశీలిస్తే భువనగిరి, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలపై ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే, మెజార్టీ అభ్యర్థులు తమ కన్నా భార్యల పేరిట ఎక్కువ ఆస్తులు చూపెట్టడం గమనార్హం.
వివిధ పార్టీల అభ్యర్థులు తమ అఫిడవిట్‌లలో వెల్లడించిన ఆస్తులు, అప్పుల వివరాలు (రూపాయల్లో)
Comments
Please login to add a commentAdd a comment