నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా.. | Sania Mirza Will Star In Her Biopic If These Bollywood Heroes Part Of It, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Sania Mirza: నా బయోపిక్‌ నేనే చేస్తా.. ఆ హీరోలు నటిస్తే మాత్రమే..!

Published Sun, Jun 9 2024 4:06 PM | Last Updated on Sun, Jun 9 2024 6:36 PM

Sania Mirza Will Star in Her Biopic if These Bollywood Heroes Part Of It

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా తాజాగా ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకు హాజరైంది. బాక్సర్‌ మేరీ కోమ్‌, బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌, షార్ప్‌ షూటర్‌ సిఫ్త్‌ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్‌ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్‌ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో మెరిసింది. 

మంచి నటీనటులు ఎందరో..
మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్‌ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్‌ శర్మ.. నువ్వు ‍ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్‌ ఖాన్‌ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది.

ఆ హీరోలైతేనే..
షారుక్‌ ఖాన్‌ లేదా అక్షయ్‌ కుమార్‌ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్‌ పాకిస్తాన్‌ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement