గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్ | Tiger Nageswara Rao Actress Nupur Sanon Open On Breakup | Sakshi
Sakshi News home page

ప్రేమలో మోసపోయిన కుర్ర హీరోయిన్.. బాత్రూంలో కూర్చుని!

Published Sun, Oct 15 2023 5:02 PM | Last Updated on Sun, Oct 15 2023 5:48 PM

Tiger Nageswara Rao Actress Nupur Sanon Open On Breakup - Sakshi

రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే ఈ మూవీతో 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తాజాగా ప్రచారంలో భాగంగా తన ప్రేమ-బ్రేకప్ గురించి నుపుర్ బయటపెట్టింది. ఏడ్చిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: Bigg Boss Elimination: ఆమె కోసం ఈమె బలి? వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!)

ఎవరీ నుపుర్?
కృతి సనన్ చెల్లి నుపుర్.. తొలుత 2005లో యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమర్‌తో రెండు ఆల్బమ్ సాంగ్స్‪‌లో యాక్ట్ చేసింది. అవి మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకోవడంతో నుపుర్ బాగా ఫేమస్ అయిపోయింది. అలా ఇప్పుడు రవితేజ సినిమాతో హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకోబోతోంది.

ఏం జరిగింది?
అయితే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రచారంలో భాగంగా తను అప్పట్లో ప్రేమలో మోసపోయిన విషయాన్ని నుపుర్ సనన్ బయటపెట్టింది. 'కాలేజీలో ఉన్నప్పుడు ఓ అ‍బ్బాయిని గాఢంగా లవ్ చేశాను. కానీ తను మోసం చేస్తున్నాడని అర్థమయ్యేటప్పటికీ.. నేను అతడిని ఎంత గుడ్డిగా నమ్మేశానో అర్థమైంది. దీంతో ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇంట్లో వాళ్లకు ఎ‍క్కడ తెలిసిపోతుందో అని బాత్రూంలో కూర్చుని మరీ గట్టిగా ఏడ్చాను. ఈ బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది' అని నుపుర్ గతం గురించి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్‌లో ప్రమాదం.. ఆయన మృతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement