హీరోలకు అంత సీన్ లేదు: హీరోయిన్ కృతిసనన్ | Kriti Sanon Comments On Hero Based Movies After Success Of Crew Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Kriti Sanon: ఆ అభిప్రాయం ఉంది.. ప్రేక్షకులు మారాలి

Published Fri, Apr 12 2024 9:16 AM | Last Updated on Fri, Apr 12 2024 11:55 AM

Kriti Sanon Comments On Hero Based Movies After Success Of Crew Movie - Sakshi

ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే హీరోలదే హవా. స్టార్ హీరోలు ఉన్నారంటే ప్రేక్షకుడు, థియేటర్ కి వస్తాడనేది చాలామంది బలంగా నమ్మే మాట. ఇప్పుడు ఈ విషయమై 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోలకు అంత సీన్ లేదు అనేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
కృతిసనన్ ఏమంది?

(ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్)

'పెద్ద హీరో ఉన్నంత మాత్రాన సినిమా చూడటానికి ప్రేక్షకులు పరుగెత్తుకుని వచ్చేయరు. కథ బాగుంటే.. అందులో యాక్టర్స్ ఆడా? మగా? అనేది చూడరు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది నిర్మాతలు.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలు లేనప్పటికీ 'క్రూ' మూవీ బాగా ఆడుతోంది. ఇది చూసైనా సరే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.'

పైన కృతిసనన్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకులు.. హీరోల కోసం సినిమాలకు వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ బాగుందా? ఎంటర్ టైన్ మెంట్ ఉందా? లాంటివి చాలా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా తన 'క్రూ' మూవీ హిట్టయ్యేసరికి కృతి ఈ వ్యాఖ్యలు చేసింది. ఈమె చెప్పిన దానిబట్టి  చూస్తే హీరోలకు అంత సీన్ లేదని అన్నట్లేగా! ఇకపోతే కృతిసనన్.. మహేశ్ 'వన్ నేనొక్కడినే', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement