అందరు హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి ఊసెత్తడమే మర్చిపోయాడు అని అభిమానులంతా అనుకుంటున్న సమయంలో ఓ వార్త వారిలో ఎక్కడలేని ఉత్తేజాన్ని తెచ్చింది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో గిర్రుమని తిరిగిన వార్త చూసి ఫ్యాన్స్‌లో చిన్న ఆశ మొదలైంది. ఆదిపురుష్ హీరోయిన్ కృతీ సనన్‌తో మన హీరో లవ్‌లో పడ్డాడని, ఆమెతో నిశ్చితార్థం కూడా జరగబోతుందంటూ ప్రచారం జరిగింది. కానీ అదంతా వుట్టి పుకారేనని, అందులో ఏమాత్రం నిజం లేదని కృతి ఆ మధ్య క్లారిటీ ఇచ్చేసింది. అయినప్పటికీ పదే పదే తన పెళ్లి గురించే అడుగుతున్నారట! దీంతో మరోసారి ఈ పుకార్లకు చెక్ పెట్టింది కృతీ సనన్.
'అసలిదంతా వరుణ్ ధావన్ వల్లే జరిగింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో అతడికి బోర్ కొట్టింది. ఏదైనా పుకారు సృష్టిద్దామనుకున్నాడు. నా జీవితంలో ఓ స్పెషల్ పర్సన్ ఉన్నాడని చెప్తానన్నాడు, సరేనన్నాను. అలా ఓ ఇంటర్వ్యూలో నా మనసులో ఒకరున్నారని చెప్పాడు. అక్కడివరకు ఓకే కానీ ఇందులో ప్రభాస్‌ను కూడా లాగుతాడనుకోలేదు. అతడు చేసిన పెంట గురించి చెప్పేందుకు ప్రభాస్‌కు ఫోన్ చేశాను. ఆయనమో వరుణ్ ఎందుకలా అన్నాడు? అని నన్నే తిరిగి ప్రశ్నించాడు. నాకు కూడా తెలియదని చెప్పాను. అతడు నా ఫ్రెండే కానీ పిచ్చోడు, ఏదేదో మాట్లాడేశాడన్నాను. వరుణ్ చేసిన పని వల్ల నాకు శుభాకాంక్షలు చెప్తూ బోలెడన్ని మెసేజ్‌లు వచ్చాయి. అందుకే నేను స్పందించక తప్పలేదు' అని చెప్పుకొచ్చింది కృతి.
Comments
Please login to add a commentAdd a comment