Adipurush Director Om Raut Kisses To Kriti Sanon In Tirumala Temple, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Kriti Sanon: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్‌కు ముద్దు పెట్టిన ఆదిపురుష్‌ డైరెక్టర్‌

Jun 7 2023 1:23 PM | Updated on Jun 7 2023 2:51 PM

Adipurush Director Om Raut Kisses to Kriti Sanon In Tirumala - Sakshi

కృతి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఆమెకు ముద్దు పెట్టి ఆమెకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ప్రభాస్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్‌ చేతిలో నాలుగైదు సినిమాలు ఉండగా ఇందులో ఆదిపురుష్‌ మొదట రిలీజ్‌ కానుంది. జూన్‌ 16న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌తో బిజీ అయిన చిత్రయూనిట్‌ మంగళవారం(జూన్‌ 6) గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టింది. 

ఇకపోతే ఇప్పటికే ప్రభాస్‌ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నాడు. తాజాగా ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతి సనన్‌ మరికొందరు టీమ్‌ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆ తర్వాత కృతి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఆమెకు ముద్దు పెట్టి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఆదిపురుష్‌ ఈవెంట్‌లో మెరిసిన కృతీ సనన్‌.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పిన హీరో.. అమ్మాయిలంటే చులకనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement