మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన నటి రేణు దేశాయ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో రవితేజపై ప్రశంసల వర్షం కురిపించింది.
(ఇది చదవండి: రిలీజ్‌కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?)
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. '23 ఏళ్లయినా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే బద్రి సినిమా ఇప్పుడే రిలీజ్ అయినట్లు అనిపిస్తోంది. మీ ప్రేమకు నా దగ్గర పదాలు లేవు. ఇన్నేళ్లు నేను సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చిత్రబృందానికి థ్యాంక్స్. రవితేజకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమా 2019లోనే మొదలైంది. రవితేజ హీరో అని చెప్పారు. నేను వంశీని ఒక్కటే అడిగా. నేను ఈ సినిమాలో ఉన్నానా? అని. ఎందుకంటే రవితేజ పెద్ద హీరో కదా. ఈ చిత్రంలో అవకాశం రావడం నా జీవితంలో ఎంత ముఖ్యమో మీకు తెలియదు. ఈ క్షణం కోసం చాలా రోజులుగా వెయిట్ చేశా. దయచేసి మీరంతా ఈ సినిమాకు థియేటర్‌కు వెళ్లి చూడండి అంటూ అభిమానులకు రెక్వెస్ట్' చేసింది.
అనంతరం ఇకపైనా కేవలం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పాత్రలే చేస్తారని వార్తలొస్తున్నాయి నిజమేనా? కాదా? అని యాంకర్ ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని రేణు దేశాయ్ కొట్టిపారేసింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
(ఇది చదవండి: సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!)
Comments
Please login to add a commentAdd a comment