
తెలంగాణ మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ నటి రేణు దేశాయ్ కలిశారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ తరపున మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు రేణు దేశాయ్ చీఫ్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రికి రేణు దేశాయ్ సమర్పించారు.
ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ను మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్‌కి మంత్రి అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment