పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. మాస్ మహారాజా మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో నటిస్తోంది. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి భారీ క్రేజ్ వస్తోంది. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది.
హేమలత లవణం ఎవరంటే?
ఈ చిత్రంలో రేణు దేశాయ్ పోషిస్తున్న పాత్ర పట్ల ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె క్యారెక్టర్ వెనక ఉన్న అసలు సంగతేంటో తెలుసుకుందాం. అసలు ఆ పేరు ఎవరిదీ? అంత ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ను రేణుదేశాయ్ పోషించడంతో అభిమానులు సైతం నెట్టంట ఆరా తీస్తున్నారు. ఈ చిత్రంలోని హేమలత లవణం ఎవరు? అసలు ఆమె ఎవరో వివరాలు తెలుసుకుందాం.
హేమలత లవణం జీవితం
హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించింది. ఆమె తన విద్యనంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్ని పొందింది. ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు వివాహం జరిగింది.
అయితే అప్పట్లో వర్ణ వివక్షను ఎదురించి చేసుకున్న ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఆమె వినోబా భావే భూదాన యాత్రలో చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసికంగా పరివర్తన తెచ్చేందుకు కృషిచేసింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడిన, దిగువ కులాల చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981లో కావలిలో నవవికాస్ అనే సంస్థను స్థాపించి అణగారినవర్గాలను ఆదుకుంది.
(ఇది చదవండి: బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!)
జోగిని వ్యవస్థపై పోరాటం
అప్పట్లో మహిళల జోగిని వ్యవస్థపై పోరాటం చేసింది. జోగినులను, వారి పిల్లలను కాపాడేందుకు 'సంస్కార్' చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పాటు చేసింది. 'బాణామతి' లాంటి గుడ్డి నమ్మకాలతో మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వాటికి వ్యతిరేకంగా పోరాడింది. రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమేకాక.. ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించింది. అంతే కాకుండా జోగినులకు వివాహాలు కూడా చేసింది. సంస్కార్ సంస్థను స్థాపించి.. నిజామాబాదు జిల్లాలోని జోగినీ వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం చేసిన కృషి ఫలితంగానే.. అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వర్ణ, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది.
ప్రస్తుతం తెరకెక్కుతోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణుదేశాయ్ ఆమె పాత్రనే పోషిస్తోంది. ఈ సినిమాలో జోగినిల సంక్షేమం కోసి కృషి చేసిన హేమలత లవణం చరిత్రనే తెరపై చూపించనున్నారు. కాగా.. రేణు దేశాయ్ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment