'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు'.. మాస్ మహారాజా ట్రైలర్ అదుర్స్! | Ravi Teja's 'Tiger Nageswara Rao' Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Tiger Nageswararao: 'గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట.. పాతికవేలు'.. ఊరమాస్ ట్రైలర్ వచ్చేసింది!

Oct 3 2023 1:17 PM | Updated on Oct 3 2023 3:04 PM

Ravi Teja Latest Movie Tiger Nageswararao Movie Trailer Release - Sakshi

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ టైగర్‌ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్ని కథాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలత పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ ‍ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

టైగర్‌ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తే 'గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట.. పాతికవేలు' అంటూ వేలంపాటతో మొదలైంది. 'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు' అనే రవితేజ డైలాగ్‌ మాస్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. ట్రైలర్‌లో పోలీసులు, టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్‌ చుట్టే కథ తిరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సరికొత్త బాడీ లాం‍గ్వేజ్‌తో రవితేజ కనిపించనున్నారు. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్‌ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement