mass maharaja
-
'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు'.. మాస్ మహారాజా ట్రైలర్ అదుర్స్!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని కథాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలత పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తే 'గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట.. పాతికవేలు' అంటూ వేలంపాటతో మొదలైంది. 'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు' అనే రవితేజ డైలాగ్ మాస్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. ట్రైలర్లో పోలీసులు, టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్ చుట్టే కథ తిరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో రవితేజ కనిపించనున్నారు. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటిస్తోంది. అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
రవితేజ సినిమాల జాతర.. ప్రభాస్, మహేష్ ఉన్నా తగ్గేదేలే
-
ప్లాన్ మార్చిన మాస్ మహారాజ్ రవితేజ
-
రవితేజతో వర్క్ చేయడంపై శ్రీలీల ఏమన్నదంటే..?
-
‘అధర్వ’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేసిన రవితేజ
కార్తీక్ రాజు హీరోగా, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అధర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ని హీరో రవితేజ విడుదల చేశారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటివరకు వచ్చిన ఈ జానర్ సినిమాలతో పోల్చితే మా సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని పంచుతుంది. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన బాణీలు అందించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: విజయ, ఝాన్సీ. -
సినిమాలపై రవితేజ సంచలన నిర్ణయం..!
మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది 'ఖిలాడి' సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జూన్ 17న 'రామారావు ఆన్ డ్యూటీ'తో పాటు ఇదే ఏడాది దసరాకు 'ధమాకా' చిత్రాలను విడుదలకు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హీరోగా ఇంత బిజీగా ఉన్న రవితేజ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై కేవలం హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు ఓ మాట చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో రాబోయే సినిమాలో రవితేజ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మరోవైపు బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కూడా రవితేజ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
మాస్ మహారాజ రవితేజ 'ఖిలాడీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. రవితేజ అభిమానులకు ఖిలాడీ చిత్ర దర్శకనిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం ఖిలాడీ సినిమా తేదిని ప్రకటించారు. ఫిబ్రవరి 11, 2022 ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రవితేజ సిగరెట్ తాగుతూ ఘాటైన మాస్ గెటప్‌లో దర్శనిమిచ్చాడు. దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. See you in cinemas 😎 #Khiladi February 11th, 2022. pic.twitter.com/vCW6y3P1Kf — Ravi Teja (@RaviTeja_offl) November 11, 2021 ఇదిలా ఉంటే చిత్రబృందం దూకుడుగా ప్రమోట్ చేస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదల తేదీని ప్రకటించి, ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నందున, మేకర్స్ రాబోయే రోజుల్లో ప్రచారాన్ని పెంచనున్నారు. ఎ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తిగా భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్మార్ట్ ప్లే అనే ట్యాగ్ లైన్‌తో వస్తుంది. చదవండి: గజదొంగ బయోపిక్‌లో రవితేజ..ఎవరీ టైగర్ నాగేశ్వరరావు? ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్, జికె విష్ణు సినిమాటోగ్రాఫర్లు. శ్రీకాంత్ విస్సా, సంగీత దర్శకుడు డిఎస్పీ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాశారు. శ్రీమణి సాహిత్యం అందించగా, అమర్ రెడ్డి ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు. -
రవితేజకు లేటుగా అయినా కిక్కే కిక్కు!
టాలీవుడ్లో చాలా మంది ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్లు పోస్ట్ చేస్తుంటారు. కొంతమంది లేటుగా వచ్చినా లేటెస్టుగా ట్వీట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అందరూ చెబుతుంటే ట్విట్టర్లోకి ఊరికే వచ్చానని, కానీ ఇక్కడ ఇంత కిక్ వస్తుందని తనకు ఇప్పుడే తెలిసిందని అన్నాడు. టచ్ చేశారు.. టచ్‌లో ఉంటా అని కూడా చెప్పాడు. ట్విట్టర్లోకి ప్రవేశించిన రవితేజ, ప్రస్తుతానికి టాలీవుడ్లో ఎవరినీ ఫాలో కాకపోయినా, బాలీవుడ్లో మాత్రం పెద్దాయన అమితాబ్ బచ్చన్‌ను, కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడు. ట్విట్టర్లోకి కొత్తగా ప్రవేశించిన రవితేజను పలువురు నటీనటులు, దర్శకులు, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు, రవితేజ సాధారణంగా తన కుటుంబ విషయాలను పెద్దగా ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడడు. కానీ అతడి ఫ్యామిలీ ఫొటో కూడా ట్విట్టర్లోకి వచ్చేసింది. ఆయన భార్య, కూతురు, కొడుకులతో దిగిన సెల్ఫీని ఒక అభిమాని ట్వీట్ చేయగా, దానికి రవితేజ థాంక్స్ చెప్పాడు. తమన్, హరీష్ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, మధుర శ్రీధర్, ఛార్మి, ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వెన్నెల కిషోర్, హన్సిక, దర్శకుడు బాబీ.. ఇలా అనేకమంది రవితేజకు అభినందనలు తెలిపారు. Andharu chepthunte Twitter loki oorikey vacha, kani ikkada intha KICK vastundi ani ippude telsindi. Touch chesaru! Touch lo unta. — Ravi Teja (@RaviTeja_offl) 1 February 2017