‘అధర్వ’ టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసిన రవితేజ | Mass Maharaja Raviteja Launched Atharva Movie Poster Hyderabad | Sakshi
Sakshi News home page

‘అధర్వ’ టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసిన రవితేజ

Published Wed, Aug 31 2022 4:29 AM | Last Updated on Wed, Aug 31 2022 8:14 AM

Mass Maharaja Raviteja Launched Atharva Movie Poster Hyderabad - Sakshi

కార్తీక్‌ రాజు హీరోగా, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరోయిన్లుగా మహేష్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అధర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్‌ నూతలపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ని హీరో రవితేజ విడుదల చేశారు.

‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటివరకు వచ్చిన ఈ జానర్‌ సినిమాలతో పోల్చితే మా సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని పంచుతుంది. శ్రీ చరణ్‌ పాకాల అద్భుతమైన బాణీలు అందించారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్‌ మాధవనేని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: విజయ, ఝాన్సీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement