'మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల | Raviteja Mister Bachchan ShowReel Out Now | Sakshi
Sakshi News home page

'మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల

Published Mon, Jun 17 2024 5:01 PM | Last Updated on Mon, Jun 17 2024 5:15 PM

Raviteja Mister Bachchan ShowReel Out Now

టాలీవుడ్‌ మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌'. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే  షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే  హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' చిత్రానికి రీమేక్‌గా  'మిస్టర్‌ బచ్చన్‌' తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి షో రీల్ విడుదలైంది. రవితేజ ఎనర్జిటిక్‌గా ఈ చిత్రంలో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్‌ ఫ్యాన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్‌ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్‌ ప్రారంభించనున్నారు.

ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల మరోసారి రవితేజతో జోడీగా కనిపించనుంది. షూటింగ్‌ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement