మాస్‌ మహారాజ రవితేజ 'ఖిలాడీ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. | Raviteja Khiladi Movie Release Date Confirmed | Sakshi
Sakshi News home page

మాస్‌ మహారాజ రవితేజ 'ఖిలాడీ' రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో తెలుసా..?

Published Thu, Nov 11 2021 2:11 PM | Last Updated on Thu, Nov 11 2021 2:22 PM

Raviteja Khiladi Movie Release Date Confirmed - Sakshi

మాస్ మహారాజా రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఖిలాడీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. రవితేజ అభిమానులకు ఖిలాడీ చిత్ర దర్శకనిర్మాతలు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. గురువారం ఖిలాడీ సినిమా తేదిని ప్రకటించారు. ఫిబ్రవరి 11, 2022 ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లుగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ సిగరెట్‌ తాగుతూ ఘాటైన మాస్‌ గెటప్‌లో దర్శనిమిచ్చాడు.  దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే చిత్రబృందం దూకుడుగా ప్రమోట్ చేస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదల తేదీని ప్రకటించి, ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నందున, మేకర్స్ రాబోయే రోజుల్లో ప్రచారాన్ని పెంచనున్నారు. ఎ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తిగా భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్మార్ట్ ప్లే అనే ట్యాగ్ లైన్‌తో వస్తుంది.

చదవండి: గజదొంగ బయోపిక్‌లో రవితేజ..ఎవరీ టైగర్ నాగేశ్వరరావు?

ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్, జికె విష్ణు సినిమాటోగ్రాఫర్‌లు. శ్రీకాంత్ విస్సా, సంగీత దర్శకుడు డిఎస్పీ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాశారు. శ్రీమణి సాహిత్యం అందించగా, అమర్ రెడ్డి ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement