రవితేజకు లేటుగా అయినా కిక్కే కిక్కు! | Raviteja enters twitter, says has lot of kick now | Sakshi
Sakshi News home page

రవితేజకు లేటుగా అయినా కిక్కే కిక్కు!

Published Thu, Feb 2 2017 8:41 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

Raviteja enters twitter, says has lot of kick now


టాలీవుడ్‌లో చాలా మంది ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్లు పోస్ట్ చేస్తుంటారు. కొంతమంది లేటుగా వచ్చినా లేటెస్టుగా ట్వీట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అందరూ చెబుతుంటే ట్విట్టర్‌లోకి ఊరికే వచ్చానని, కానీ ఇక్కడ ఇంత కిక్ వస్తుందని తనకు ఇప్పుడే తెలిసిందని అన్నాడు. టచ్ చేశారు.. టచ్‌లో ఉంటా అని కూడా చెప్పాడు. ట్విట్టర్‌లోకి ప్రవేశించిన రవితేజ, ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఎవరినీ ఫాలో కాకపోయినా, బాలీవుడ్‌లో మాత్రం పెద్దాయన అమితాబ్ బచ్చన్‌ను, కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడు. 
 
ట్విట్టర్‌లోకి కొత్తగా ప్రవేశించిన రవితేజను పలువురు నటీనటులు, దర్శకులు, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు, రవితేజ సాధారణంగా తన కుటుంబ విషయాలను పెద్దగా ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడడు. కానీ అతడి ఫ్యామిలీ ఫొటో కూడా ట్విట్టర్‌లోకి వచ్చేసింది. ఆయన భార్య, కూతురు, కొడుకులతో దిగిన సెల్ఫీని ఒక అభిమాని ట్వీట్ చేయగా, దానికి రవితేజ థాంక్స్ చెప్పాడు. తమన్, హరీష్ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, మధుర శ్రీధర్, ఛార్మి, ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వెన్నెల కిషోర్, హన్సిక, దర్శకుడు బాబీ.. ఇలా అనేకమంది రవితేజకు అభినందనలు తెలిపారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement