ఇన్నింగ్స్‌ విజయం దిశగా ఇంగ్లండ్‌ | England towards an innings win | Sakshi
Sakshi News home page

ఇన్నింగ్స్‌ విజయం దిశగా ఇంగ్లండ్‌

Published Fri, Jul 12 2024 4:41 AM | Last Updated on Fri, Jul 12 2024 3:28 PM

England towards an innings win

లండన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ విజయం దిశగా సాగుతోంది. మ్యాచ్‌ రెండో రోజు 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది. అండర్సన్, అట్కిన్‌సన్, స్టోక్స్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్‌ మరో 171 పరుగులు చేయాలి. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 189/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 90 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. జో రూట్‌ (68; 7 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (50; 5 ఫోర్లు, 1 సిక్స్‌), తొలి టెస్టు ఆడుతున్న జేమీ స్మిత్‌ (70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. విండీస్‌ బౌలర్లలో జీడెన్‌ సీల్స్‌ 4 వికెట్లు పడగొట్టగా... హోల్డర్, గుడకేశ్‌ మోతీ 2 వికెట్లు చొప్పున తీశారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement