టెస్ట్‌ల్లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఛాంపియన్ టీమ్.. తాజాగా అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌ల్లో (తొలి) విండీస్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాజిల్‌వుడ్ (9/79), ట్రవిస్ హెడ్ (119) విజృంభించడంతో మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కఠినమైన పిచ్‌పై అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. హాజిల్‌వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్‌కెంజీ (50), 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ సెంచరీతో కదంతొక్కడంతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. విండీస్ ఆరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ (5/94) ఆసీస్‌ను దెబ్బతీశాడు.
95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్‌కెంజీ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆడుతూపాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. స్టీవ్ స్మిత్ 11, లబూషేన్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఉస్మాన్ ఖ్వాజా (9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment