Craig bratvait
-
తేజ్‌నారాయణ్, బ్రాత్‌వైట్ అజేయ సెంచరీలు
వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టును వర్షం వెంటాడుతోంది. తొలి రోజు 51 ఓవర్ల ఆట సాధ్యమైతే... రెండో రోజు 38 ఓవర్లు మాత్రమే పడ్డాయి. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు కూడా జింబాబ్వే బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 112/0తో ఆట కొనసాగించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 బ్యాటింగ్; 7 ఫోర్లు)... తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (291 బంతుల్లో 101 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడైన తేజ్‌నారాయణ్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... క్రెయిగ్ బ్రాత్వైట్కిది 12వ శతకం. 1999లో న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఓపెనర్లు అడ్రియన్ గ్రిఫిత్ (114), షెర్విన్ క్యాంప్‌బెల్ (170) సెంచరీలు చేసిన తర్వాత... మళ్లీ విండీస్ ఓపెనర్లు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు చేయడం విశేషం. -
క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్‌మన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటికే బ్రాత్‌వైట్ 184 బంతుల్లో 72 పరుగులతో క్రీజులో పాతుకు పాతుకుపోయాడు. దీంతో లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా ఒక తెలివైన బంతితో బ్రాత్‌వైట్‌ను బోల్తా కొట్టించాడు. ఓవర్ ది వికెట్ మీదుగా లసిత్ వేసిన బంతి లెగ్‌స్టంప్ దిశగా వెళ్లింది. అయితే బ్రాత్‌వైట్ బంతిని డిఫెన్స్ చేద్దామని ఫ్రంట్‌ఫుట్ వచ్చాడు. కానీ అప్పటికే బంతి టర్న్ అయి ప్యాడ్ల సందుల్లోంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. చదవండి: SL Vs WI Test Series: 91 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లు.. శ్రీలంక 204 ఆలౌట్ ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 21, చరిత్ అసలంక 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. రమేశ్ మెండిస్ 6 వికెట్లు తీయగా.. ఎంబుల్డేనియా 2, జయవిక్రమ 2 వికెట్లు తీశారు. చదవండి: IND Vs NZ: మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఏమి తప్పుకాదు.. How good was that? pic.twitter.com/9RJfIxXEXF — Rex Clementine (@RexClementine) December 1, 2021 -
విండీస్‌ను ఆదుకున్న క్రెయిగ్ బ్రాత్‌వైట్
షార్జా: ఓపెనర్ క్రెరుుగ్ బ్రాత్‌వైట్ (206 బంతుల్లో 95 బ్యాటింగ్; 10 ఫోర్లు) పోరాటంతో వెస్టిండీస్ కోలుకుంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్సలో 78 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. సోమవారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఒక దశలో 68 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. జాన్సన్ (1)ను రియాజ్ ఔట్ చేయగా, డారెన్ బ్రేవో (11) బాబర్ బౌలింగ్‌లో నిష్కమించాడు. శామ్యూల్స్ (0)ను యాసిర్ షా డకౌట్ చేశాడు. తర్వాత బ్లాక్‌వుడ్ (23) నిలదొక్కుకుంటున్న క్రమంలో ఆమిర్ దెబ్బతీశాడు. దీంతో బ్రాత్‌వైట్... చేజ్, డౌరిచ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. మొదట రోస్టన్ చేజ్ (89 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 83 పరుగులు, డౌరిచ్ (90 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించి ఇన్నింగ్‌సను చక్కదిద్దాడు. ఆట ముగిసే సమయానికి బ్రాత్‌వైట్‌తో పాటు, హోల్డర్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆమిర్, రియాజ్ చెరో వికెట్లు తీశారు. అంతకుముందు 255/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్సలో 281 పరుగుల వద్ద ఆలౌటైంది.