
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్‌మన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటికే బ్రాత్‌వైట్ 184 బంతుల్లో 72 పరుగులతో క్రీజులో పాతుకు పాతుకుపోయాడు. దీంతో లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా ఒక తెలివైన బంతితో బ్రాత్‌వైట్‌ను బోల్తా కొట్టించాడు. ఓవర్ ది వికెట్ మీదుగా లసిత్ వేసిన బంతి లెగ్‌స్టంప్ దిశగా వెళ్లింది. అయితే బ్రాత్‌వైట్ బంతిని డిఫెన్స్ చేద్దామని ఫ్రంట్‌ఫుట్ వచ్చాడు. కానీ అప్పటికే బంతి టర్న్ అయి ప్యాడ్ల సందుల్లోంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది.
చదవండి: SL Vs WI Test Series: 91 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లు.. శ్రీలంక 204 ఆలౌట్
ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 21, చరిత్ అసలంక 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. రమేశ్ మెండిస్ 6 వికెట్లు తీయగా.. ఎంబుల్డేనియా 2, జయవిక్రమ 2 వికెట్లు తీశారు.
చదవండి: IND Vs NZ: మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఏమి తప్పుకాదు..
How good was that? pic.twitter.com/9RJfIxXEXF
— Rex Clementine (@RexClementine) December 1, 2021