KL Rahul back at training in nets prepping for Australia Test series - Sakshi
Sakshi News home page

KL Rahul: పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్‌ మొదలైంది

Published Wed, Feb 1 2023 9:30 AM | Last Updated on Wed, Feb 1 2023 11:04 AM

KL Rahul Back At Training In Nets Prepping For Australia Test Series - Sakshi

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరి 23న గర్ల్‌ఫ్రెండ్‌ అతియా శెట్టిని రాహుల్‌ వివాహమాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తంతు ముగియగానే రాహుల్‌ తన ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే పెళ్లి కోసం న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన రాహుల్‌ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో కలవనున్నాడు.

సిరీస్‌కు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉండడంతో ముంబైలోని బాంద్రా క్రికెట్‌ క్లబ్‌లో నెట్‌ప్రాక్టీస్‌ చేశాడు. కాగా రాహుల్‌ అంతగా ఫామ్‌లో లేకపోవడం భారత్‌కు ప్రతికూలం. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ గైర్హాజరీలో జట్టును నడిపించిన రాహుల్‌ కెప్టెన్‌గా సక్సెస్‌ అయినప్పటికి బ్యాటర్‌గా ఫెయిలయ్యాడు. టీమిండియా 2-0తో సిరీస్‌ నెగ్గగా.. రాహుల్‌ మాత్రం నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 22, 23, 10, 2 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9న ఆసీస్‌తో మొదలుకానున్న తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్‌లో వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌కు జతగా గిల్‌ వచ్చే చాన్స్‌ ఉన్నప్పటికి.. కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చినా రావొచ్చు. అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ తొలి టెస్టుకు దూరం కావడంతో సూర్యకు లైన్‌ క్లియర్‌ అయింది. ఒకవేళ​ గిల్‌, రోహిత్‌లు ఓపెనర్లుగా వస్తే.. కేఎల్‌ రాహుల్ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్‌ ఉంటుంది. 

చదవండి: IND Vs AUS: తొలి టెస్టుకు శ్రేయాస్‌ దూరం.. జడ్డూ రీఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement