India Vs Australia 3rd Test: Shubman Gill And KL Rahul Contenders For Same Spot, Practice Together In Nets - Sakshi
Sakshi News home page

KL Rahul-Gill: పోటాపోటీగా ప్రాక్టీస్‌.. అవకాశమెవరికి?

Published Tue, Feb 28 2023 8:32 AM | Last Updated on Tue, Feb 28 2023 11:24 AM

KL Rahul-Shubman Gill Practice Video Viral Fighting-Same Spot 3rd Test - Sakshi

ఇండోర్‌ వేదికగా మార్చి ఒకటి నుంచి టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టులోనూ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఈ విషయం పక్కనబెడితే ప్రస్తుతం ఒక అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది. కేఎల్‌ రాహుల్‌ మూడో టెస్టు ఆడతాడా లేదా? వరుసగా రెండు టెస్టుల్లో ఘోర ప్రదర్శన చేసిన రాహుల్‌ను ఇప్పటికే వైస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు.

దీంతో మూడోటెస్టుకు రాహుల్‌ తుదిజట్టులో ఉండే అవకాశాలు లేవని.. అతని స్థానంలో గిల్‌ ఎంట్రీ ఖాయమని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్టుకు తుదిజట్టు ఎంపిక చేసేవరకు కేఎల్‌ రాహుల్‌ను ఆడిస్తారా.. బెంచ్‌కు పరిమితం చేస్తారా అన్నది చెప్పడం కష్టమే. ఎందుకంటే కెప్టెన్‌ రోహిత్‌ సహా కోచ్‌ ద్రవిడ్‌ల అండ కేఎల్‌ రాహుల్‌కు ఉంది. మరోవైపు గిల్‌ మాత్రం ఎప్పుడెప్పుడు టెస్టు జట్టులోకి రావాలా అని ఎదురుచూస్తున్నాడు. ఓపెనింగ్‌ స్లాట్‌ కోసం ఈ ఇద్దరి మధ్య విపరీతమైన పోటీ ఉంది. రాహుల్‌ ఫామ్‌ దృశ్చా గిల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌, శుబ్‌మన్‌ గిల్‌ల ప్రాక్టీస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు పక్కపక్కన నిలబడి అరగంట పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. వీరిద్దరి ప్రాక్టీస్‌ను కోచ్‌ ద్రవిడ్‌ సహా కెప్టెన్‌ రోహిత్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆఫ్‌ స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించుకున్న రాహుల్‌ 18 బంతులను ఢిపెన్స్‌ ఆడాడు. ఆ తర్వాత గిల్‌తో స్థానం మార్చుకొని అశ్విన్‌ బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు త్రోడౌన్స్‌ ప్రాక్టీస్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement