టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన చర్యతో తోటి ఆటగాళ్లను నవ్వించడానికి ప్రయత్నిస్తుంటాడు. సీరియస్‌గా జరుగుతున్న మ్యాచ్‌ల్లో కోహ్లి చాలాసార్లు తన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వు తెప్పించేవాడు. తాజాగా ఢిల్లీ వేదికగా ముగిసిన రెండో టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు కోహ్లి చేసిన ఒక చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లతో కలిసి కోహ్లి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడిన కోహ్లి సడన్‌గా గిల్ వద్దకు వచ్చి పొట్ట కింద బాగంలో ఒక పంచ్ ఇచ్చాడు. అంతే గిల్ పెద్దగా నవ్వుతూ ఒక ఉదుటన ఎగిరి గంతేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీగా స్పందించారు. '' బాధ్యతగా ఉండాల్సిన నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటి''.. ''కోహ్లి సాబ్ ఏంటి నీ ప్రవర్తన రోజురోజుకు శ్రుతి మించిపోతుంది''.. ''పాపం గిల్.. ఒకవేళ తగలరాని చోట తగిలి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి కోహ్లి'' అంటూ కామెంట్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్‌పై పర్యాటక జట్టే స్పిన్‌తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్‌బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్‌ను సమర్పించుకుంది. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వకపోవడం విశేషం.
What is this Behaviour Kohli Sahab?🤣🤣😭 pic.twitter.com/5peN8bX7NE
— ✨ (@greenysoulin) February 19, 2023
Comments
Please login to add a commentAdd a comment