పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు లంచ్ సమయానికి శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. లంక జట్టు మరో 55 పరుగులు వెనుకబడి ఉంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో తొలి టెస్టులో ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే పాకిస్తాన్‌కు గెలుపు అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.
ఈ విషయం పక్కనబెడితే మూడోరోజు ఆటలో పాక్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇన్నింగ్స్ 120వ ఓవర్ రమేశ్ మెండిస్ వేశాడు. క్రీజులో పాక్ 11వ నెంబర్ బ్యాటర్ అర్బర్ అహ్మద్ ఉన్నాడు. మెండిస్ వేసిన బంతి అర్బర్ గ్లోవ్స్‌ను తాకి అతని ప్యాడ్లలో ఇరుక్కుంది. అయితే బంతి కింద పడకపోవడంతో అర్బర్ తన కాళ్లను షేక్ చేశాడు. ఈలోగా లంక వికెట్ కీపర్ సదీరా సమరవిక్రమ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకువచ్చాడు.
కానీ అర్బర్ తనవైపు వస్తున్న సమరవిక్రమను ఆటపట్టించాలని ముందుకు పరిగెత్తుకొచ్చాడు. అర్బర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో తను రనౌట్ అవుతానేమోనని వెంటనే బంతిని కింద పడేసి క్రీజులోకి పరిగెత్తుకొచ్చాడు. అయితే కీపర్ సమరవిక్రమ రనౌట్ చేయకుండా బంతిని తనవద్దే ఉంచుకున్నాడు. ఇదంతా ఫన్నీగా సాగడంతో అక్కడున్న వారందరి మొహాల్లో నవ్వులు విరపూశాయి. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇదంతా గమనించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నవ్వును ఆపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్ అయింది. ధనుంజయ డిసిల్వా (122 పరుగులు) సెంచరీతో రాణించగా.. ఏంజలో మాథ్యూస్ 64 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది,నసీమ్ షా, అర్బర్ అహ్మద్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో461 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్(208 పరుగులు నాటౌట్) డబుల్ సెంచరీతో మెరవగా.. ఆగా సల్మాన్ 83 పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ ఐదు వికెట్లతో రాణించగా.. ప్రభాత్ జయసూరియా మూడు వికెట్లు తీశాడు.
Funniest Moment Today With Abrar Ahmad 🤣😂. #PAKvsSL #PAKvSL #SLvPAK #SLvsPAK pic.twitter.com/IjHPsWqGoo
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 18, 2023
చదవండి: Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి'
SL VS PAK 1st Test: డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ఈ పాక్ ఆటగాడే.. ఏకంగా 98.50 సగటు
Comments
Please login to add a commentAdd a comment