శ్రీలంక పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. లంక విధించిన 131 పరుగుల టార్గెట్‌ను పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్ హక్(50 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మూడు వికెట్లకు 48 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.24 పరుగులు చేసిన బాబర్ ఆజం ప్రభాత్ జయసూరియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్ హీరో సాద్ షకీల్ 38 బంతుల్లో 30 పరుగులతో నిలకడగా ఆడి పాక్‌ను విజయం దిశగా నడిపించాడు. అయితే స్వల్ప వ్యవధిలో షకీల్‌తో పాటు కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ ఔటయ్యారు. వీర్దిదరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అగా సల్మాన్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి పాక్‌కు విజయాన్ని అందించాడు.
లంక బౌలర్లలో ప్రభాత్ జయసూరియా నాలుగు వికెట్లు తీయగా.. రమేశ్ మెండిస్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్ అయింది. ధనుంజయ డిసిల్వా సెంచరీతో మెరిశాడు. ఇక పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్ అయింది. సాద్ షకీల్ డబుల్ సెంచరీ(208 పరుగులు నాటౌట్)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక 279 పరుగులకే చాప చుట్టేసింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూలై 24 నుంచి 28 వరకు కొలంబో వేదికగా జరగనుంది.
లంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఇప్పటివరకు పాక్ లంకలో 26 టెస్టులాడి 10 విజయాలు అందుకొని తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఇంగ్లండ్ జట్టు(18 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు), భారత్(24 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో) మూడో స్థానంలో ఉంది.
చదవండి: Ashes 2023: 'అనుకున్నంత గొప్ప క్యాచ్ ఏమి కాదులే..
Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే'
Most Test match wins by an away team in Sri Lanka:
— Grassroots Cricket (@grassrootscric) July 20, 2023
Pakistan 10 (26 matches)
England 9 (18 matches)
India 9 (24 matches)
📸: SLC#SLvPAK | #PAKvSL | #CricketTwitter pic.twitter.com/rvkQUuXdJb
Comments
Please login to add a commentAdd a comment