విండీస్‌ను ఆదుకున్న క్రెయిగ్ బ్రాత్‌వైట్
షార్జా: ఓపెనర్ క్రెరుుగ్ బ్రాత్‌వైట్ (206 బంతుల్లో 95 బ్యాటింగ్; 10 ఫోర్లు) పోరాటంతో వెస్టిండీస్ కోలుకుంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్‌సలో 78 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. సోమవారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఒక దశలో 68 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. జాన్సన్ (1)ను రియాజ్ ఔట్ చేయగా, డారెన్ బ్రేవో (11) బాబర్ బౌలింగ్‌లో నిష్కమించాడు. శామ్యూల్స్ (0)ను యాసిర్ షా డకౌట్ చేశాడు. తర్వాత బ్లాక్‌వుడ్ (23) నిలదొక్కుకుంటున్న క్రమంలో ఆమిర్ దెబ్బతీశాడు.
దీంతో బ్రాత్‌వైట్... చేజ్, డౌరిచ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. మొదట రోస్టన్ చేజ్ (89 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 83 పరుగులు, డౌరిచ్ (90 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించి ఇన్నింగ్‌సను చక్కదిద్దాడు. ఆట ముగిసే సమయానికి బ్రాత్‌వైట్‌తో పాటు, హోల్డర్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆమిర్, రియాజ్ చెరో వికెట్లు తీశారు. అంతకుముందు 255/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్‌సలో 281 పరుగుల వద్ద ఆలౌటైంది.