ఆసియాకప్-2023లో టీమిండియా బోణీ కొట్టేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం పల్లెకెలె వేదికగా పసికూన నేపాల్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షార్పణమైందన్న బాధలో ఉన్న అభిమానులకు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్-నేపాల్ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 80 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం పల్లెకెలె వర్షం పడుతోంది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పరిస్థితేంటి అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి?
ప్రస్తుత పరిస్థితుల బట్టి భారత్- నేపాల్ మ్యాచ్ జరిగే అవకాశం కన్పించడం లేదు. టాస్ పడకుండా రద్దు అయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే భారత్-నేపాల్ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో గ్రూపు-ఏ నుంచి టీమిండియా సూపర్-4కు అర్హత సాధిస్తుంది.
ఎలా అంటే?
గ్రూపు-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రూపు నుంచి పాకిస్తాన్(3 పాయింట్లు) సూపర్-4కు అర్హత సాధించింది. దీంతో మరో స్ధానం కోసం భారత్-నేపాల్ జట్లు పోటీపడతున్నాయి. అయితే ఇప్పటికే పాకిస్తాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో భారత్ ఖాతాలో ఒక్కపాయింట్ వచ్చి చేరింది.
మరోవైపు పాక్ చేతిలో ఓడిపోవడంతో నేపాల్ ఖాతాలో ఎటువంటి పాయింట్లు లేదు. ఈ క్రమంలో నేపాల్‌తో మ్యాచ్ రద్దయినా భారత్‌కు ఒక్క పాయింట్ లభిస్తోంది. దీంతో 2 పాయింట్లతో భారత్ సూపర్-4కు చేరుకుంటుంది. ఇలా జరిగితే నేపాల్ ఇంటిముఖం పట్టకతప్పదు.
చదవండి: Asia Cup 2023: కోహ్లి, రోహిత్‌లను అడ్డుకుంటాము.. భారత్‌కు పోటీ ఇస్తాం: నేపాల్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment