దాదాపు ఏడాది తర్వాత వన్డేక్రికెట్‌లో అడుగుపెట్టిన టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఈ ఏడాది ఆసియాకప్ వన్డే టోర్నీతో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్ బుమ్ బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో బుమ్రా నాలుగు వికెట్లు మాత్రమే సాధించినప్పటికీ.. పవర్‌ప్లేలో మాత్రం భారత్‌కు అద్బుతమైన ఆరంభాన్ని అందించాడు.
కొత్త బంతితో బుమ్రా అద్బుతాలు సృష్టించాడు. ఈ క్రమంలో బుమ్రాపై టీమిండియా మాజీ ఓపెనర్ అకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు కనిపించడం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు.
"జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లు వేయగలడా అని మనం ఆలోచిస్తున్నాము. ఆసియాకప్‌లో అతడు ఏ మ్యాచ్‌లో కూడా తన ఫుల్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. కానీ ఈ ఈవెంట్‌లో అతడు వేసిన ప్రతీ ఓవర్ కూడా ఒక అద్భుతం. అది జట్టుకు చాలు . అతడు ప్రతీ సారి 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. నా వరకు అయితే బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు కనిపించడం లేదు.
బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌గా ఉన్నాడు. అదే విధంగా మంచి రిథమ్‌లో కూడా ఉన్నాడు. అతడు ఫీల్డ్‌లో కొంచెం కూడా ఇబ్బంది పడడడం లేదు. అతడు బంతిని రెండు వైపులా అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. అతడు పేస్‌లో వైవిధ్యం చూపిస్తున్నాడు. బుమ్రా తిరిగి రావడం జట్టుకు ఎంతో బలాన్ని ఇచ్చిందని "చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా రాహుల్! మరి రోహిత్?
Comments
Please login to add a commentAdd a comment