ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. నవంబర్ 26న తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు ఆసీస్ మాత్రం ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని వ్యూహాలు రచిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరగనున్న తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 55 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో రెండో టీ20.. తిలక్ వర్మకు నో ఛాన్స్! జట్టులోకి డేంజరస్ ఆటగాడు
Comments
Please login to add a commentAdd a comment