
చెన్నై: నిన్నటి నుంచి చెన్నై నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు నగరంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ జరుగనున్న చిదంబరం స్టేడియం పరిసరాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతానికి అక్కడ ఆకాశం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ భారీ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.అయితే ప్రస్తుతానికి చిరు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి కాబట్టి.. మ్యాచ్ ఆరంభ సమయానికి వరణుడు కరుణిస్తే మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment