ప్రపంచకప్‌ సెమీస్‌కు వర్షం ! | Rain Confirms Semis Berth In ICC World cup 2019 | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ సెమీస్‌కు వర్షం !

Published Wed, Jun 12 2019 9:11 AM | Last Updated on Wed, Jun 12 2019 9:11 AM

Rain Confirms Semis Berth In ICC World cup 2019 - Sakshi

లండన్‌ : ‘ఐసీసీ ప్రపంచకప్‌-2019 సెమీస్‌కు 6 పాయింట్లతో ‘వర్షం’  సెమీస్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ తరువాతి స్థానంలో నిలిచి సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.’ అని ప్రపంచకప్‌-2019 టోర్నీని ఉద్దేశించి సోషల్‌మీడియా వేదికగా అభిమానులు చేస్తున్న ట్రోల్స్‌. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. గత రెండు రోజులుగా అక్కడ వాతావరణ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. టాస్‌ వేయడం.. వర్షం రావడం సాధారణం అయిపోయింది. బంగ్లాదేశ్‌- శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దవ్వగా... సోమవారం దక్షిణాఫ్రికా- వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 7.3 ఓవర్ల అనంతరం వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్‌ రద్దై సఫారీల టైటిల్‌ ఆశలే గల్లంతయ్యాయి. జూన్‌ 7న పాకిస్తాన్‌-శ్రీలంక మ్యాచ్‌ కూడా ఇలానే ఒక్క బంతి పడకుండా రద్దైంది. (చదవండి : మళ్లీ వరుణుడు గెలిచాడు)

నేడు పాకిస్తాన్‌ -ఆస్ట్రేలియా, రేపు భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లకు కూడా వర్షం అడ్డంకిగా మారే అవశం ఉండటంతో యావత్‌ క్రికెట్‌ అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అంతర్జాతీ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)పై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడే దగ్గర ప్రపంచకప్‌ ఎవడు నిర్వహించమన్నాడని మండిపడుతున్నారు. సెటైరిక్‌ మీమ్స్‌తో కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ‘ఈ ప్రపంచకప్‌లో 11వ జట్టుగా వర్షం పాల్గొంది. అది 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తుంది. సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. నేటి పాక్‌-ఆసీస్‌, రేపటి భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ గెలిస్తే వర్షానికి తిరుగేలేదు.’  అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టాస్‌ గెలిచిన శ్రీలంక స్విమ్మింగ్‌ ఎంచుకుందని సెటైర్లేస్తున్నారు. ఇక వర్షానికి శ్రీలంక రెండు సార్లబలైంది. ఈ పరిణామం లంక నాకౌట్‌ అవకాశాలపై ప్రభావం చూపనుంది. (చదవండి : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్‌..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement